Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. RRR సినిమాతో రికార్డులను క్రియేట్ చేసిన రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించారు. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. హీరోలో ఉన్న టాలెంట్ ను పూర్తిగా బయటికి తీయడం రాజమౌళికి మాత్రమే సాధ్యం. గుంటూరు కారం తర్వాత మహేష్ రాజమౌళితో సినిమాకి ఓకే చెప్పారు. ఈ సినిమా గురించి ఎంత చిన్న విషయం బయటకు వచ్చినా అది వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం..
Also read: Jr. NTR: వంశీ ఇంట బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..!
హాలీవుడ్ స్థాయి కి తెలుగు సినిమా ..
జక్కన్న సినిమా అంటేనే, కోట్లు కొల్లగొడుతుందన్న రికార్డు ఉంది. అలాంటిది మహేష్ బాబుతో చేస్తున్నాడు అంటే ఆ రికార్డు ఊహకే వదిలేయవచ్చు. మహేష్ 29వ చిత్రం ఇది. 55 వేల థియేటర్లలో రిలీజ్ చేస్తారని టాక్ ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 5000 కోట్లు ఉంటుందని, జక్కన్న దీనికోసం బాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు టీజర్ బయటికి రాలేదు. ఫస్ట్ లుక్ రాలేదు. అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రాలేదు, ఏదీ జరగలేదు. కానీ జక్కన్న వేస్తున్న ప్లాన్ రివీల్ అయినట్టు టాక్. మొదటి రోజే 1400 ధియేటర్లలో రిలీజ్ చేసి, భారీ మొత్తంలో వసూలు చేయాలన్నది జక్కన్న ప్లాన్. హాలీవుడ్ మార్కెట్లో తనదైన ముద్రవేయాలనుకుంటున్న జక్కన్న సినిమాను 55 వేల ధియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. ఇందులో 35 వేల ధియేటర్లు కేవలం యూరప్, నార్త్ అమెరికాలోనే ఉన్నాయి. అసలు మహేష్ మూవీ మూడు షెడ్యూల్ కి మించి పూర్తికాలేదు. రిలీజ్ కి ముందే 5000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే, ఆ సినిమా రిలీజ్ రోజే 1400 కోట్లు వసూలు చేయటానికి ప్లాన్ ని వేస్తున్నరు మూవీ టీం. నిజంగానే ఇదంతా సాధ్యమవుతుందా అంటే.. 55 వేల ధియేటర్లలో రిలీజ్ చేయడం అంత సులభం కాదు. అసలు నిజంగా అలానే రిలీజ్ చేస్తే మొదటి రోజు కాదు మొదటి షో తోనే కోట్లు కొల్లగొట్టొచ్చు. ఈ సినిమా మీద ఇంత బిజినెస్ జరగటానికి మరోకారణం..
Also read: Sudigali Sudheer : జిమ్ లో కూడానా…? ఇలా తయారయ్యారు ఏంట్రా నాయన
ఒక్కరోజులోనే అన్ని కోట్లు ..
హాలీవుడ్ రేంజిలో సినిమాను తీయడానికి జక్కన్న అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్, జురాసిక్ పార్క్ డైరెక్టర్, స్టీవెన్ ను రంగంలోకి దించనున్నారు. ఈనెల 21న జరిగే ప్రెస్ మీట్ కు వీరిరువురు రాబోతున్నారు. యూఎస్ కెనడాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీరు సిద్ధమయ్యారు. జక్కన్న రామాయణంలో హనుమంతుడు పాత్రను ఆధారంగా తీసుకొని సినిమా ని డిజైన్ చేస్తుండటం మరో విశేషం. ఇలా చాలా అంశాలు అందరి అటెన్షన్ ని లాక్కొనెలా వున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు 5000 ధియేటర్స్ లో రిలీజ్ అయితే, తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో మరో మెట్టు ఎక్కినట్టే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జక్కన మంచి స్కెచ్ తో మహేష్ ని మంచి రికార్డు తో అది కూడా RRR రికార్డు బ్రేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా నుండి అఫీషియల్ ఎనోన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.