E-Paper
Advertisement

Paneer recipe: పనీర్ కొబ్బరి కర్రీ రెసిపీ.. చపాతీ, రోటీతో అదిరిపోయే కాంబినేషన్

Paneer recipe: పనీర్ కొబ్బరి కర్రీ రెసిపీ.. చపాతీ, రోటీతో అదిరిపోయే కాంబినేషన్
Advertisement

పనీర్ కొబ్బరి కూర ఎంతో రుచిగా ఉంటుంది. పనీర్ ఎప్పుడూ ఒకేలా వండే కన్నా…కాస్త కొత్తగా ఇలా వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. పనీర్ మృదుత్వం, కొబ్బరి వాసన కలిసి ఈ కర్రీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. ఈ వంటకం అన్నంతోనే కాదు, చపాతీ, రోటీ, నాన్‌తో కూడా చాలా బాగా సరిపోతుంది. ముఖ్యంగా కొబ్బరి ఎక్కువగా ఇష్టపడేవారికి ఇది ఒక స్పెషల్ రెసిపీ. ఇప్పుడు ఈ పనీర్ కొబ్బరి కర్రీని ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

పనీర్ కొబ్బరి కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పనీర్ – 250 గ్రాములు
కొబ్బరి తురుము – అర కప్పు
ఉల్లిపాయ – ఒకటి
టమోటాలు – రెండు
పచ్చిమిర్చి – రెండు
పసుపు – పావు స్పూన్
కారం – ఒక స్పూన్
ధనియాల పొడి – ఒక స్పూన్
గరం మసాలా – అర స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం తరుగు – అర స్పూను
వెల్లుల్లి – అయిదు రెబ్బలు
నూనె – 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

Advertisement

పనీర్ కొబ్బరి కర్రీ రెసిపీ
1. ముందుగా పనీర్ ముక్కలను ఒక గిన్నెలో వేసి గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. ఇలా చేస్తే పనీర్ చాలా మెత్తగా ఉంటుంది. తర్వాత నీరు వడగట్టి పక్కన పెట్టండి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
3. ఇప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి.
4. తర్వాత తరిగిన టమోటాలు వేసి మూత పెట్టి మగ్గించాలి.
5. ఇప్పుడు టమోటా మిశ్రమంలో పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
6. ఇప్పుడు గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ లేదా కొబ్బరి పాలు ఈ మసాలాలో కలపాలి. మెల్లగా కలుపుతూ గ్రేవీలా అయ్యేలా చేయాలి.
7. అవసరమైతే కొద్దిగా నీరు పోసుకోవచ్చు. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
8. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పనీర్ ముక్కలను గ్రేవీలో వేసి మెల్లగా కలపాలి.
9. పనీర్ విరగకుండా జాగ్రత్తగా కలపాలి. మంట తక్కువగా పెట్టి 5 నుంచి 7 నిమిషాలు ఉడికించాలి.
10. చివరగా గరం మసాలా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపాలి. పైన కొత్తిమీర తరిగి చల్లి గార్నిష్ చేయాలి. అంతే పనీర్ కొబ్బరి కూర రెడీ అయినట్టే.

వేడి వేడి పనీర్ కొబ్బరి కూరను చపాతీ, రోటీతో తింటే అద్భుతంగా ఉంటుంది. దీన్ని బగారా రైస్ కు జోడీగా తిన్నా కూడా కాంబినేషన్ అదిరిపోతుంది. ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా కూర వండి చూడండి. అద్భుతంగా ఉంటుంది.

Related News

బిడ్డకు ఆకలి వేసిందో లేదో ఎలా తెలుసుకోవాలి? తల్లిదండ్రులకు రెస్పాన్సివ్ ఫీడింగ్ గైడ్

మనసంతా ప్రేమ.. ఈ తేదీల్లో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే మీరు చాలా లక్కీ

పండుగ వేళ అందరిలో స్పెషల్‌గా కనిపించాలా? ఈ 5 మేకప్ లుక్స్ ట్రై చేయండి

డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు ఎవరు చెల్లించాలి? 2026లో కొత్త ట్రెండ్ గురూ

పిల్లలు ఇంటి గోడలపై డ్రాయింగ్ వేస్తూ పాడు చేశారా? నో టెన్షన్ క్రేయాన్ మరకలు క్లీన్ చేసే సింపుల్ ట్రిక్స్ ఇవిగో

ఫుడ్ పాయిజనింగ్‌ అంటే కేవలం వాంతులు, విరేచనాలు కాదు.. నరాలు, కిడ్నీలు, కీళ్లకు ప్రమాదం.. ఎలాగంటే

పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతోంది.. టీనేజ్ విద్యార్థుల్లో ప్రమాదకర మార్పులు.. కారణాలు ఇవే

వయసు పెరిగినా అద్భుతమైన జ్ఞాపకశక్తి.. పదునైన మెదడు కోసం పది సూత్రాలు

Big Stories

Advertisement
×