Danish Kaneria Supports Modi Against India Protests: దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు గత మూడు రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మోడీ సర్కార్ లో నీట్ తో పాటు పలు ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని… దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ CJP ప్రతినిధులతో పాటు నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డు ఎక్కారు. ఈ నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ కూడా సపోర్ట్ గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు… ఈ నిరసనలలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిరసనలను వ్యతిరేకిస్తూ పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో జరిగే ప్రతి నిరసనకు ఒకే స్క్రిప్ట్ ఉంటుందని బాంబు పేల్చారు. విద్యార్థుల నిరసనల వెనుక కూడా కుట్రకోణం ఉందంటూ ఆరోపణలు చేశారు. రాముడిని, మోదీని తిట్టడమే నిరసనా? అంటూ నిలదీశారు.
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో… వివాదాస్పద పోస్ట్ పెట్టి రచ్చ లేపాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ఈ మధ్యకాలంలో ఇండియాలో అనేక గొడవలు జరుగుతున్నాయని… లేటెస్ట్ గా నీట్ విషయంలో కూడా ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు. ప్రతి నిరసనకు ఒకే స్క్రిప్టు ఉంటుందని బాంబు పేల్చారు. నిరసనలు ఎప్పుడు జరిగినా రాముడు, భారత మాత, హిందుత్వం, మోడీ అలాగే ఆయన తల్లిని తిడుతున్నారని ఫైర్ అయ్యారు. గొడవలు జరిగినప్పుడు చర్చలు పరిష్కారాలు ఏమీ లేవని మండిపడ్డారు.
నినాదాలు, దూషణలు, గందరగోళమే ఇండియాలో కనిపిస్తోందని సీరియస్ అయ్యారు. ఇండియాలో కూడా నేపాల్ లాంటి పరిస్థితులు తీసుకురావాలని ప్రతిపక్షాలు కలలు కంటున్నాయని ఆగ్రహించారు. అమెరికాతో ట్రేడ్ డీల్ జరగక ముందే కొందరు రైతులు ఢిల్లీని బ్లాక్ చేసేందుకు వెళ్లడం ఏంటో ? ఇది సర్కస్ లాగా మారుతోందని వివాదాస్పద పోస్ట్ పెట్టారు డానిష్ కనేరియా. అసలు రాముడిని… ఇటు ప్రధాని నరేంద్ర మోడీని తిట్టడమే నిరసనగా మారిపోయిందని ఫైర్ అయ్యారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై డానిష్ కనేరియా స్పందిస్తూ… మరో వీడియోను కూడా సోషల్ మీడియాలో పెట్టారు. నిరసనల పేరుతో కొంతమంది కత్తులు తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు. పోలీస్ అధికారులపై కత్తులతో దాడులు చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. దీనిపై వెంటనే మోడీ సర్కార్ యాక్షన్ తీసుకోవాలని పరోక్షంగా హింట్ ఇచ్చారు. కాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయిన డానిష్ కనేరియా… ఒక హిందువే. మొదటినుంచి భారతదేశానికి సపోర్ట్ గా నిలుస్తూ.. హిందుత్వం ధర్మం కోసం పోరాడుతున్న ఏకైక క్రికెటర్ ఇతడే. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా తాజాగా పోస్ట్ పెట్టారు.
I am disturbed because every protest in India seems to have the same script.
1. Abuse Lord Ram.
2. Abuse Bharat Mata.
3. Abuse PM Modi.
4. Abuse PM Modi’s late mother.
5. Abuse Brahmins.
6. Abuse Hindutva.
No discussion.
No solutions.
Only slogans, abuse, and chaos.
The…
— Danish Kaneria (@DanishKaneria61) July 22, 2026
Look at the NEET aspirants. 😀 pic.twitter.com/VbOcqArOyG
— Danish Kaneria (@DanishKaneria61) July 22, 2026