BigTV English

Darius Visser: యూవీ వరల్డ్ రికార్డు బద్దలు.. ఒకే ఓవర్‌లో 39 రన్స్ బాదిన విస్సెర్

Darius Visser: యూవీ వరల్డ్ రికార్డు బద్దలు.. ఒకే ఓవర్‌లో 39 రన్స్ బాదిన విస్సెర్

Darius Visser Breaks World Records in T20: టీ20 మ్యాచ్‌లలో ప్రపంచ రికార్డు నమోదైంది. డేరియస్ విస్సెర్ ఒకే ఓవర్‌లో 39 పరుగులు చేయడంతో అంతకుముందు యువరాజ్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆసియా, పసిఫిక్ రీజియన్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సమోవా, వనాటు జట్లు తలపడ్డాయి.


ఈ మ్యాచ్‌లో వనాటు జట్టుపై సమోవా ప్లేయర్ డేరియస్ విస్సెర్ 6 బంతులకు 6 సిక్సర్లు బాదాడు. మ్యాచ్ 15వ ఓవర్‌లో బౌలర్ 3 నోబాల్స్ వేయడంతో మొత్తం 39 పరుగులు వచ్చాయి. దీంతో అంతకుముందు యువరాజ్, పూరన్, దీపేంద్ర, రోహిత్, రింకూ సింగ్ పేరిట ఉన్న రికార్డ్స్‌ను విస్సెర్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విస్సర్ 62 బంతుల్లో 132 పరుగులు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమోవా ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్‌ను వనాటు బౌలర్ నిలిన్ నిపికో వేశాడు. ఈ ఓవర్‌లో నమోవా బ్యాటర్ విస్సెర్..6 బంతులను 6 సిక్స్ కొట్టాడు. అయితే బౌలర్ 3 నోబాల్స్ వేయడంతో మొత్తం 39 పరుగులు వచ్చాయి. అంతకుముందు 2012 జూలై 24న ససెక్స్, గ్లౌసెస్టర్ షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌లో 38 పరుగులు వచ్చాయి. కానీ ఆ మ్యాచ్ దేశీయ మ్యాచ్. కాగా, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక్క ఓవర్‌లో అత్యధికంగా నమోదైన పరుగులు 36 మాత్రమే.


2007 టీ 20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ 6 బంతులకు 6 సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత కీరన్ పొలార్డ్(2021), నికోలస్ పూరన్(2024), దీపేంద్ర సింగ్(2024)లు 36 పరుగులు చేశారు. ఇందులో యువరాజ్, పొలార్డ్ మాత్రమే వరుసగా ఆరు సిక్స్‌లు కొట్టారు.

Also Read: రజతం పతకం సాధించి.. రెస్టారెంట్ లో పని…

డేరియస్ విస్సెర్ 6 సిక్స్‌ల జాబితా చేరాడు. కానీ వరుసగా కొట్టలేదు. మొదటి మూడు బంతులకు వరుసగా సిక్స్ లు కొట్టగా.. నాలుగో బంతి నోబాల్‌ను కొట్టలేదు. తర్వాత బంతికి సిక్స్ కొట్టిన విస్సెర్ ఐదో బంతికి పరుగులు లభించలేదు. ఆరోబంతికి నోబాల్ నమోదు కాగా ఎలాంటి పరుగులు లభించలేదు. మళ్లీ నోబాల్ నమోదు కాగా, ఈ సారి సిక్స్ బాదాడు. ఆరో బంతికి కూడా సిక్స్ కొట్టడంతో మొత్తం 39 పరుగులు వచ్చాయి.

https://twitter.com/SportzOnX/status/1825752189710774526

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×