BigTV English

Silver Medalist Zhou Yaqin: రజతం పతకం సాధించి.. రెస్టారెంట్ లో పని…

Silver Medalist Zhou Yaqin: రజతం పతకం సాధించి.. రెస్టారెంట్ లో పని…

Silver Medalist Zhou Yaqin serving customers in Restaurant days after Paris olympics: ఒలింపిక్స్ లో రజత పతకం సాధించడం అంటే మాటలు కాదు,  కోట్ల రూపాయలు వచ్చి పడతాయని అనుకుంటారు. అయితే చాలా మార్కెటింగ్ కంపెనీలు పోటీ పడి మరి, విజేతలను తమ వ్యాపార ప్రకటనలకు ఉపయోగిస్తుంటారు. మరి అలాంటిది రజతం సాధించిన ఓ జిమ్నాస్ట్.. ఒక రెస్టారెంట్ లో పనిచేస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అసలేం జరిగిందని నెటిజన్లు గందరగోళం పడుతుంటే, మొత్తానికి అసలు విషయం బయటపడింది.


ఇంతకీ ఆ రజత పతక విజేత మరెవరో కాదు చైనాకు చెందిన యాకిన్. తను హునాన్ ప్రావిన్స్ లోని హెన్ గ్యాంగ్ నగరంలో నివసిస్తోంది. అయితే అక్కడ వారికి  సొంతంగా ఒక రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు యాకిన్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన తర్వాత సరాసరి ఇంటికి వెళ్లి, అమ్మానాన్నలు నిర్వహించే రెస్టారెంట్ లో వారికి సహాయ పడుతోంది.

ఏ మాత్రం భేషజాలకు పోకుండా, తను రజత పతక విజేతని అనే గర్వం లేకుండా హోటల్ లో సర్వర్ పనులు చేయడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 18 ఏళ్ల యాకిన్ లో ఇంత గొప్ప ఆదర్శభావాలు ఉండటం నిజంగా గొప్ప విషయమని అంటున్నారు.
ఒలింపిక్ దుస్తుల్లోనే తను సర్వ్ చేస్తున్న ద్రశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ యాకిన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒలింపిక్స్ విజయాన్ని, ఇటు కుటుంబ బాధ్యతలను సమానంగా మోస్తున్న యాకిన్ ని చూసి నేటి యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని కామెంట్లు రాస్తున్నారు.


18 ఏళ్ల యాకిన్ తొలిసారిగా పారిస్ ఒలింపిక్స్ లో ఆరంగేట్రం చేసింది. తొలి పోటీల్లోనే రజత పతకం సాధించి ఔరా అనిపించింది. అయితే పతకం గెలిచిన తర్వాత ఇక్కడ ఓ ట్విస్ట్ జరిగింది. అదేమిటంటే యాకిన్ కి ఇదే అంతర్జాతీయ తొలి పతకం. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన అందరూ కూడా పోడియం వద్ద నిలుచుని ఉన్నారు.

Also Read: ఎవరి బరువు వారే చూసుకోవాలి: కాస్ వివరణ

అయితే ఫస్ట్, థర్డ్ వచ్చిన వారిద్దరూ తమ పతకాలను నోటితో కొరికి పట్టుకున్నారు. యాకిన్ వారి పక్కనే ఉండి, వారిని చూసి, గతుక్కుమంది. వారిలాగే నేను కూడా అలా నోటితో పట్టు కోవాలేమోనని భావించి, సడన్ గా నోటి దగ్గర పెట్టుకుని ముద్దు పెట్టుకుంది. అలా చేసి తనంతట తానే సిగ్గుపడి పోడియం దిగి వెళ్లిపోయింది.

18 ఏళ్ల అమ్మాయి అక్కడ చేసిన పని చూసి లోకమంతా ముచ్చటపడింది. ఇప్పుడు తను సొంత హోటల్ లో సర్వర్ గా చేస్తుంటే, యాకిన్ ని మెచ్చుకుంటోంది. ఇది కదా నేటి యువతరం… అని అందరూ కొనియాడుతున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×