BigTV English

Davis Tennis World Cup 2024: డేవిస్ కప్ లో భారత్ సూపర్..!

Davis Tennis World Cup 2024: డేవిస్ కప్ లో భారత్ సూపర్..!
Davis cup 2024

India Entered in Davis Tennis World Cup 2024:


పాకిస్తాన్ తో ఆట అనేసరికి మనవాళ్లలో ఎక్కడలేని ఎనర్జీ లెవల్స్ పెరిగిపోతుంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న డేవిస్ కప్ లో భారత పురుషుల టెన్నిస్ జట్టు ఘన విజయం సాధించింది.

60 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో అడుగుపెట్టిన భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ముందడుగు వేసింది. సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్ అన్నింటా మనవాళ్లు విజయ ఢంకా మోగించారు. ఇప్పటివరకు పాకిస్తాన్ పై భారత్ ఎనిమిది విజయాలను సాధించింది.


పాకిస్థాన్‌కు ఎక్కడ కూడా చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా 4-0తో చిత్తు చేసింది. డేవిస్‌కప్‌ ప్రపంచ గ్రూప్‌-1లోకి ప్రవేశించింది. రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ సత్తా చాటడంతో ప్లే ఆఫ్ లో  2-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. తర్వాత రోజు కూడా భారత్ అదే జోరు కొనసాగించి డబుల్స్‌, రివర్స్‌ సింగిల్స్‌ను చేజిక్కించుకుని ఘన విజయాన్ని సాధించింది.

డబుల్స్‌లో ముజామిల్‌ మొర్తజా-అకీల్‌ఖాన్‌ జోడీని సాకేత్‌ మైనేని-యుకి బాంబ్రి జంట 6-2, 7-6 (7-5)తో ఓడించింది. తొలిసెట్లో భారత జంట దూకుడుగా ఆడింది. రెండో సెట్లో పాక్ జోడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మొత్తానికి మనవాళ్లు తర్వాత పంజుకున్నారు. 

కాకపోతే టై బ్రేకర్ వరకు వెళ్లింది. అక్కడ కూడా సర్వీసుల్లో ఇబ్బందులు పడిన భారత జంట 2-4తో వెనుకడుగు వేసింది. తర్వాత ఎట్టకేలకు పుంజుకుని స్కోర్ సమం చేసింది. తర్వాత పై చేయి సాధించి విజయం సాధించింది.

నామమాత్రమైన  రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు పూంచా 6-3, 6-4తో మహ్మద్‌ షోయబ్‌పై గెలిచాడు. ఇక చివరి రెండో రివర్స్‌ సింగిల్స్‌ ఆడలేదు. 1964 తర్వాత పాకిస్తాన్ గడ్డపై భారత టెన్నిస్‌ జట్టుకు ఇదే తొలి గెలుపు అని చెప్పాలి. 

ఫార్మాట్ ఏదైనా పాకిస్తాన్ పై భారత్ సాధిస్తున్న ఘన విజయాలపై నెట్టింట ప్రశంసలు జల్లు కురుస్తున్నాయి. డేవిస్ కప్ లో భారత్ ఇంకా ముందుకి వెళ్లాలని భారతీయాలు ఆశిస్తున్నారు.

Tags

Related News

CSK Biryani Restaurant : CSK అంటే మామూలుగా ఉండదు.. ధోని పేరుతో బిర్యానీలు

Neeraj Chopra’s wife : నీరజ్ చోప్రా భార్యకు పట్టిన దరిద్రం.. 1.5 కోట్ల జాబ్, సర్వం కోల్పోయిందిగా!

Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

Ind vs Pak: 10 సెకండ్లకు 16 లక్షలు… ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ తో కోట్ల వర్షం !

Team India: టీమిండియా ప్లేయర్ పై టాలీవుడ్ ఆంటీ కన్ను.. ?

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్య వంశీపై దారుణంగా ట్రోలింగ్…సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు అంటూ

Big Stories

×