Big Stories

Vande Metro Train: జూలై నుంచే దేశంలో మొట్టమొదటి వందే మెట్రో రైలు..

Vande Metro Train: భారతీయ రైల్వే శాఖ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రోజురోజుకూ దేశంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వందే మెట్రో రైలును నడపనున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

జూలై నుంచి దేశంలో వందే మెట్రో రైలు పట్టాలెక్కనున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరగుతున్నాయని తెలిపారు. మెట్రో మార్గంలో మొదటి దశలో దేశంలోని 124 నగరాలను కలపనున్నాయన్నారు.

- Advertisement -

ప్రస్తుతానికి 50 వందే మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయని రైల్వే మంత్రి తెలిపారు. ప్రస్తుతానికి ఈ ట్రైన్లు అందుబాటులో ఉన్నాసరే వాటిని ఏ మార్గంలో పరీక్షించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మొదటి దశ పరీక్ష పూర్తి అయిన వెంటనే.. మరో 400 అదనపు వందే భారత్ మెట్రోలను ఆర్డర్ చేస్తామన్నారు.

వచ్చే రెండు నుంచి మూడేళ్లలో 400 వందే మెట్రోలను దేశంలోని వివిధ నగరాల్లో నడిపేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వందే భారత్ మెట్రోలో కోచ్ ల సంఖ్య అవసరాన్ని బట్టి ఉంటుందన్నారు. 4, 5, 12, 16 కోచ్ లు ఉండేలా రైల్వే శాఖ కసరత్తులు చేస్తోందన్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు ఉండే మార్గంలో 16 కోచ్ లు ఉంటాయన్నారు.

Also Read: అలాంటి.. ఔషధ తయారీదారులపై చర్యలు తప్పవు : ఆయుష్ మంత్రిత్వ శాఖ

మొదటి స్వదేశీ సెమీ-హై స్పీడ్ వందే భారత్ మెట్రో ఇంటర్ సిటీ తరహాలో నడుస్తుందన్నారు. వీటిని గరిష్ఠంగా 250 కిలోమీటర్లు దూరంలో ఉన్న నగరాలను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 130 కిలోమీటర్లు ఉంటుంది. కాగా ఛార్జీలు కూడా సాధారణంగా ఉంటాయన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News