Big Stories

Telangana people free from Dubai Jail: 18 ఏళ్లుగా దుబాయ్‌ జైలులోనే..! ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి

5 Telangana residents released from prison in Dubai

5 Telangana People Free from Dubai Jail: ‘బ్రతుకు పలసబారి వలస పోతున్నారు.. వచ్చేది ఎన్నడో..’ అనే పాట వీరికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అమ్మా నాన్నేడి అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఓ తల్లి, కొడుకు ఎప్పుడొస్తడో తెలియని ఓ తండ్రి, అన్న అసలు వస్తాడా రాడా అని ఓ తమ్ముడు 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో వీరిని కలుసుకున్న కుటుంబసభ్యుల ఆనందానికి హద్దులు లేవు.

- Advertisement -

ఇక వివరాళ్లోకెలితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వలసలకు పెట్టింది పేరు. దుబాయ్, మస్కట్‌లకు ఎక్కువగా ఈ ప్రాంత ప్రజలు వలసెల్లుతుంటారు. సిరిసిల్ల, రుద్రంగి, కోనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు 18 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లారు. అనుకోకుండా వారు ఒక హత్య కేసులో ఇరికిపోయి 25 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

- Advertisement -

నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో దుబాయ్ కోర్టు తొలుత వీరికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత దాన్ని 25 ఏళ్లకు పెంచింది. దీంతో తమ వారు వస్తారా రారా.. అసలు బ్రతికే ఉన్నారా లేరా అని దినదినగండంగా జీవనం గడపసాగారు.

Read More: నేటి నుంచే మేడారం మహాజాతర.. ఇవ్వాళ గద్దెపైకి రానున్న సారలమ్మ..

గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్.. నేపాల్‌కు వెళ్లి ఆ వాచ్‌మెన్ కుటుంబానికి 15 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారు. వారి కుటుంబసభ్యులతో క్షమాభిక్ష పత్రం రాపించారు. అయినా వారి శిక్షలో ఎలాంటి మార్పు రాలేదు.

తాజాగా అనారోగ్య కారణాల దృశ్యా వారిని విడిచిపెట్టాలని న్యాయవాదులు కోరగా చివరకి 18 ఏళ్ల శిక్ష తర్వాత వారిని విడిచి పెట్టింది దుబాయ్ కోర్టు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యలు బుధవారం ఉదయం శంషాబాదం విమానాశ్రయంలో తమ వారిని కలుసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భావోద్వేగంతో నిండిపోయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News