BigTV English

Virat Kohli Son Akaay: ‘అకాయ్’ జపాన్ వారి పేరులా ఉందే..! నెటిజన్ల ఆరా..

Virat Kohli Son Akaay: ‘అకాయ్’ జపాన్ వారి పేరులా ఉందే..! నెటిజన్ల ఆరా..
celebrity news today

Virat Kohli’s Son Akaay: మొత్తానికి విరాట్ కోహ్లీ బయట ప్రపంచంలోకి వచ్చాడు. అదీ మంచి వార్తతో వచ్చాడు. అనుష్కశర్మ పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. తను ప్రెగ్నెన్సీతో ఉందనే సంగతి అందరికీ తెలుసు.


ఎందుకంటే ఎన్నో క్రికెట్ మ్యాచ్‌లకు తను అలాగే వచ్చింది. విరాట్ కొహ్లీని అభినందిస్తూ అతనితో పాటే తిరిగింది. సడన్‌గా కోహ్లీ అంతర్థానం అయిపోయేసరికి, ఎవరికీ అంతుచిక్కలేదు. అదే విషయమా? కాదా? అనేది అర్థం కాక జుత్తులు పీక్కున్నారు.

మొత్తానికి కోహ్లీ తల్లికి బాగాలేదని కొందరన్నారు. దాంతో కోహ్లీ తమ్ముడికి వళ్లు మండింది. బీసీసీఐ కూడా పలు సందర్భాల్లో క్రికెటర్ల ప్రైవసీని కాపాడమని సోషల్ మీడియాని కోరుతోంది. తాజాగా అశ్విన్ మాతృమూర్తి ఆసుపత్రి పాలైనప్పుడు ఇదే రిక్వెస్ట్ చేసింది. మరో సందర్భంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా కోహ్లీ గురించి మాట్లాడాడు. ఇన్నేళ్ల క్రికెట్ చరిత్రలో కోహ్లీ ఎప్పుడూ ఇన్నిరోజులు సెలవు పెట్టలేదని అన్నాడు. తన కోరికను మన్నించడం బీసీసీఐ ధర్మమని అన్నాడు.


Read More: మరో సారి తండ్రి అయిన విరాట్.. పండంటి అబ్బాయికి జన్మనిచ్చిన అనుష్క..

ఇక పలువురు ప్రశ్నలు వేస్తుంటే, ఆ మాట దాటేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు కోహ్లీయే తీపి కబురుతో వచ్చాడు. సరే తన అబ్బాయికి అకాయ్ అని పేరు కూడా పెట్టేశాడు. పెద్దమ్మాయి పేరు వామికా.. తన తమ్ముడి పేరు అకాయ్.. ఇంతవరకు బాగానే ఉంది. కోహ్లీ, అనుష్కలు బాగానే ఉన్నారనే విషయం తెలిసిపోయింది.

అందుకే ఇప్పుడు నెట్టింట జనం ‘అకాయ్ ’అంటే అర్థం ఏమిటి? అని తెగ వెతికేస్తున్నారు. కొన్ని అర్థాలు బయటకు వస్తున్నాయి. అందులో ఒకటి ‘అమరుడు’, రెండు మృత్యుంజయుడు, మూడు చిరంజీవి.. ఇలా చెప్పుకోవాలి.

నెట్టింట జనం కుదురుండరు కదా.. టెలివిజన్లు వచ్చిన కొత్త రోజుల్లో అకాయ్ టీవీ అని ఒకటి ఉండేది. ఇంకా శాన్ సుయ్ అని కూడా ఉండేది. వీటితో పాటు బుష్, పానాసోనిక్, బీపీఎల్ ఇలా టీవీ కంపెల పేర్లు రాసుకుంటూ కొందరు వెళుతున్నారు.

అకాయ్ కంపెనీ జపాన్‌లోని టోక్యోలో ఉంది. బహుశా కోహ్లీ, అనుష్క దంపతులు జపాన్ వాళ్ల పేరుని పెట్టారా? అని పరిశోధనలు చేస్తున్నారు. మనోళ్ల సంగతి తెలిసే , ఇన్నాళ్లు కోహ్లీ దంపతులు ప్రపంచానికి దూరంగా ఉన్నారని కొందరంటున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×