Chicken RS 1000 Per Kg: క్రీడా మైదానంలో నాయకుడిగా మహేంద్రసింగ్ ధోని సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎం.ఎస్ ధోని ఆట అసాధారణమైనది. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలు, అసాధారణ నాయకత్వంతో అతడు క్రీడలో చెరగని ముద్ర వేశాడు. భారత క్రికెట్ కి మహేంద్రసింగ్ ధోని అందించిన సేవలు, రికార్డ్ బ్రేకింగ్ ఫీట్ లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాల ఔత్సాహిక క్రికెట్ లకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది.
Also Read: India Tour of Bangladesh: పొలిటికల్ వార్… టీమిండియా బంగ్లాదేశ్ టూర్ రద్దు?
ఎంతటి కీలక సమయాల్లోనైనా ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉంటూ విజయాలను అందించిన తీరు ధోనీకి “కెప్టెన్ కూల్” గా గుర్తింపు తెచ్చాయి. ఇలాంటి లెజెండరీ కెప్టెన్ మరో మూడు రోజుల్లో 44వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. జులై 7 న మహేంద్ర సింగ్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రపంచ నలుమూలల నుండి ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ధోనీ గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ధోని ఫామ్ హౌస్:
ఎంఎస్ ధోనీ వ్యవసాయాన్ని ఎంతగా ఇష్టపడతాడో ఆయన అభిమానులకు బాగా తెలుసు. ధోనీకి తన స్వస్థలమైన రాంచీలో 43 ఎకరాల విస్తీర్ణంలో ఫామ్ హౌస్ ఉంది. అతడు రాంచీకి వచ్చినప్పుడల్లా తన ఫామ్ హౌస్ కి కచ్చితంగా వెళతాడు. ఆ ఫామ్ హౌస్ లో వివిధ రకాల కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నారు. అంతేకాదు అక్కడ చేపలు, కోళ్లు, ఆవులను కూడా పెంచుతున్నారు. వీటితోపాటు టమాటోలు, బ్రోకలీ, ఫ్రెంచ్ బీన్స్, స్ట్రాబెరీ, జామా వంటి అనేక రకాల పండ్లు కూరగాయలను కూడా సాగు చేస్తున్నారు. వీటిని మార్కెట్లో కూడా అమ్ముతుంటారు. ఈ ఫామ్ హౌస్ రాంచి రాజధాని సిమాలియాలోని రింగ్ రోడ్డులో ఉంది. అయితే ధోనీ తనకు నచ్చిన పని చేసేందుకు ఏమాత్రం వెనకాడడు. అతడు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన అనంతరం అనేక వ్యాపారాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తన సతీమణి సాక్షి సింగ్ సాయంతో అన్ని రంగాల్లో అడుగుపెట్టాడు.
ధోని చికెన్ బిజినెస్:
అయితే ధోనీ ఫామ్ హౌస్ లో కడక్ నాథ్ చికెన్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ కడక్నాథ్ కోళ్లను పెంచుతున్నారు. ఈ ఫామ్ హౌస్ లో కడక్ నాథ్ కోళ్లను సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నారు. అంటే వీటిని పెంచడానికి ఎటువంటి ఇంజక్షన్ లేదా ఔషధాలను ఉపయోగించరు. దీంతో ఈ కోళ్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఈ కోళ్లు ప్రత్యేకమైన జాతికి చెందినవి.
Also Read: Shubman Gill: కోహ్లీ కోసం ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్న గిల్… అసలు కారణం ఇదే
ఈ కోళ్లు నలుపు రంగులో మాత్రమే కాకుండా.. వీటి మాంసం, ఎముకలు, రక్తం కూడా నలుపు రంగులోనే ఉంటాయి. ఇవి సాధారణ బ్రాయిలర్ కోళ్ల కంటే ఆరోగ్యకరమైనవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో ఈ కోళ్లు కిలోకి రూ. 700 నుండి రూ. 1500 ధర పలుకుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఈ కోడి ధర ఏకంగా నాలుగు వేల వరకు ఉంది. ఇక ధోని ఫామ్ హౌస్ లోపించిన ఈ కడకనాథ్ కోడి మాంసం కిలోకి రూ. 1000 పలుకుతుందని చెబుతున్నారు.