Shubman Gill: టీమిండియా యువ కెప్టెన్ శుబ్ మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో సెంచరీ చేసిన గిల్.. రెండవ టెస్ట్ లో ద్విశతకం సాధించాడు. ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ లో అద్వితీయమైన ఇన్నింగ్స్ తో చెలరేగిన గిల్.. 269 పరుగుల భారీ స్కోర్ ని నమోదు చేశాడు. ఈ క్రమంలో భారత టెస్ట్ కెప్టెన్ గా అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ {254*} పేరిట ఉన్న రికార్డ్ ని గిల్ బద్దలు కొట్టాడు.
Also Read: Football Player Death: 10 రోజుల కిందటే పెళ్లి.. అంతలోనే కారు ప్రమాదంలో ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి
గిల్ కెప్టెన్ గా తన రెండవ మ్యాచ్ లోనే ఈ అరుదైన ఘనతను అందుకోవడం విశేషం. తద్వారా ఈ రెండవ టెస్ట్ లోని తొలి ఇన్నింగ్స్ లో భారత్ 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఒకానొక దశలో ఐదు వికెట్లు కోల్పోయి 211 పరుగులు మాత్రమే చేసిన భారత జట్టు.. చివరి ఐదు వికెట్లకు ఏకంగా 376 పరుగులు జోడించింది. కెప్టెన్ గిల్ {269}, రవీంద్ర జడేజా {89}, వాషింగ్టన్ సుందర్ {42} పరుగులు చేశారు. ఇక మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు.
అయితే 269 పరుగులు చేసి.. ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న గిల్.. టీ బ్రేక్ తరువాత షోయబ్ బషీర్ వేసిన ఓవర్ లో స్లిప్ ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ఆటగాడు హ్యరీ బ్రూక్.. గిల్ ని మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. 290 పరుగుల వద్ద ఆడడం చాలా కష్టం అని బ్రూక్ అనగా.. నీ కెరీర్ లో ఎన్ని ట్రిపుల్ సెంచరీలు చేశావు..? అని గిల్ ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్లు కామెంటేటర్ మైక్ అథర్టన్ వివరించారు. ఇక ఈ సంభాషణ జరిగిన కాసేపటికే గిల్ తన వికెట్ ని కోల్పోయాడు.
ఐతే భారత తొలి ఇన్నింగ్స్ అనంతరం గిల్ చేసిన స్కోర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీ కోసమే గిల్ తన ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడని నెట్టింట వైరల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కి, గిల్ చేసిన స్కోర్ కి సంబంధం ఏంటంటే.. కోహ్లీ టెస్ట్ క్యాప్ నెంబర్ #269. అంటే కోహ్లీ భారతదేశనికి టెస్ట్ ఫార్మాట్ లో ప్రాతినిథ్యం వహించిన 269 వ ఆటగాడు. అతడు 2011లో వెస్టిండీస్ పై అరంగేట్రం చేసినప్పుడు ఈ క్యాప్ ని పొందాడు.
Also Read: Anaya Bangar: ప్రైవేట్ పార్ట్స్ కు సర్జరీ.. అక్కడ ప్లాస్టర్ వేయించుకొని మరి…!
ఇటీవల టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంలో కూడా తన సోషల్ మీడియాలో.. “#269, సైన్ ఆఫ్” అని పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ కోసమే గిల్ 269 పరుగుల వద్ద అవుట్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక భారత బ్యాటింగ్ అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.