Missterious movie Teaser: సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఎన్నో విభిన్నమైన కొత్త కథలతో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నాయి. ఇలా విభిన్న కథలతో ప్రేక్షకులను సందడి చేయడానికి నటీనటులు దర్శక నిర్మాతలు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఇదే తరహా సినిమాలపై దర్శకులు కూడా ఎక్కువగా ఫోకస్ చేశారని తెలుస్తుంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో మిస్టీరియస్(Missterious) సినిమా కూడా ఒకటి.
హీరోగా రక్త కన్నీరు నాగభూషణం మనవడు..
అలనాటి “రక్త కన్నీరు” నాగభూషణం.(Nagabhushanam) మనవడు అబిద్ భూషణ్ (Abid Bhushan)హీరోగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆబిద్ భూషణ్, బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహాని(Rohit Sahaani) హీరోలుగా, రియా కపూర్(Riya Kapoor) మేఘనా రాజ్ పుత్(Meghana Rajputh) హీరోయిన్లుగా నటిస్తున్న మిస్టీరియస్ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది అతి త్వరలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.
సినిమా సక్సెస్ పై కాన్ఫిడెన్స్ పెరిగింది..
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు మహి కోమటిరెడ్డి (Mahi Komati Reddy)దర్శకత్వం వహించగా ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మరియు శివాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా డైరెక్టర్ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ… సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని తెలిపారు. తాజాగా విడుదల చేసిన టీజర్ కు వస్తున్న ఆదరణ చూస్తుంటే సినిమా సక్సెస్ పై ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగిందని మహి కోమటిరెడ్డి వెల్లడించారు.
టీజర్ కు విశేష స్పందన..
నిర్మాతలు కూడా మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో తాము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము. టీజర్ కు ఇంత మంచి ఆదరణ రావడం విశేషం. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తామనీ నిర్మాతలు తెలియజేశారు. ఇక హీరోయిన్లు ఇద్దరు కూడా ఇలాంటి ఒక మంచి సినిమాలో అవకాశం కల్పించినందుకు చిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు.
ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే..
ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో, హీరోలుగా
రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్),అబిద్ భూషణ్ (ప్రముఖ నటుడు రక్త కన్నీరు నాగభూషణ్ మనవడు), రియా కపూర్ (హీరోయిన్), మేఘనా రాజపుత్ (హీరోయిన్), బలరాజ్ వాడి (కన్నడ నటుడు), ఆకునూరి గౌతమ్,భోగిరెడ్డి శ్రీనివాస్, రాజమౌళి(జబర్దస్త్), గడ్డం నవీన్ (జబర్దస్త్), లక్ష్మి, వేణు పోల్సాని తదితరులు భాగమయ్యారు.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మహి కోమటిరెడ్డి,
నిర్మాత: జయ్ వల్లందాస్ (USA)
పాటలు మరియు సంగీతం: ML రాజా
కెమెరా & ఎడిటింగ్: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా)