ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ప్రయాణీకుల అదనపు రద్దీని తగ్గించడానికి నాందేడ్- తిరుపతి- నాందేడ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఈ రెండు వేర్వేరు వీక్లీ సర్వీసులు ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని వెల్లడించారు. నాందేడ్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు( 07189) జూలై 25 వరకు ప్రతి శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరుతుంది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇదే ఎక్స్ ప్రెస్ రైలు(07190) జూలై 5 నుంచి 26 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం తిరుపతి నుంచి 2.20 గంటలకు బయల్దేరుతుంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
ఈ రైలు ఏ స్టేషన్లలో ఆగుతుందంటే?
ఈ ప్రత్యేక రైలు మార్గం మధ్యలో ముద్దేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, నెమళ్లపూడి, రొంపిచర్ల, వినుకొండ, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, జమ్ముల మడుగు, ఎర్రగుంట, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో నిలుస్తాయి.
అటు నాందేడ్ నుంచి తిరుపతికి జూలై 26 వరకు మరో ప్రత్యేక రైలును నపడనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సర్వీసు (07015) ప్రతి శనివారం సాయంత్రం 4.50 గంటలకు నాందేడ్ నుంచి బయల్దేరుతుంది. ఆదివారం ఉదయం 10.10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి నాందేడ్ వెళ్లే రైలు (07016) జూలై 27 వరకు తిరుపతి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 1.15గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
ఈ ప్రత్యేక రైళ్లు మార్గం మధ్యలో ముర్ఖడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్ , మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, కర్నూలు, డోన్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజ౦పేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
Read Also: అరుణాచలం టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC అదిరిపోయే ప్యాకేజీ మీ కోసమే!
ఈ ప్రత్యేక రైళ్లలో 1 AC, 2 AC, 3 AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ రైళ్లకు సంబంధించిన షెడ్యూల్ వివరాలతో పాటు టికెట్ల బుకింగ్ కోసం SCR వినియోగదారులు అధికారిక మొబైల్ యాప్ లేదంటే IRCTC వెబ్ సైట్ ను చూడాలని రైల్వే అధికారులు సూచించారు. ఈ రైళ్ల ద్వారా ప్రయాణీకులు ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు కొనసాగించవచ్చన్నారు.
Read Also: కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు, ఇతర రూట్లలో కూడా!