BigTV English

Djokovic Vs Alcaraz on Gold medal: పారిస్ ఒలింపిక్స్.. గోల్డ్ మెడల్ కోసం అల్కరాస్‌తో జకోవిచ్ ఢీ

Djokovic Vs Alcaraz on Gold medal: పారిస్ ఒలింపిక్స్.. గోల్డ్ మెడల్ కోసం అల్కరాస్‌తో జకోవిచ్ ఢీ

Djokovic Vs Alcaraz on Gold medal: పారిస్ ఒలింపిక్స్‌లో మరో ఆసక్తికర సమరానికి తెరలేసింది. టెన్నిస్‌లో గోల్డ్ మెడల్ కోసం ఇద్దరు ఆటగాళ్లు కొదమసింహాల మాదిరిగా తలపడునున్నారు. ఒకరు సెర్బి యా టెన్నిస్ ఐకాన్ ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ కాగా, స్పెయిన్ రైజింగ్ స్టార్ కార్లోస్ అల్కరాస్.


పారిస్ ఒలింపిక్స్‌లో ఈసారి సత్తా చాటాలని భావిస్తున్నాడు ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్. కెరీర్‌కు ఇదే చివరి ఒలింపిక్స్‌గా భావిస్తున్న జకోవిచ్, బంగారు పతకంపై కన్నేశాడు. కాకపోతే స్పెయిన్ రైజింగ్ స్టార్ కార్లోస్ అల్కరాస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీన్ని అధిగమించాలని భావిస్తున్నాడు జకోవిచ్.

సెమీస్‌లో ఇటలీకి చెందిన లోరెంజో ముసెట్టిని వరుస సెట్లలో ఓడించాడు జకోవిచ్. తొలిసారి ఒలింపిక్స్ లో ఫైనల్‌కు చేరాడు. ఐదో ఒలింపిక్స్ ఆడుతున్న జకోవిచ్, మూడుసార్లు సెమీస్‌లో ఇంటిదారి పట్టాడు. అంతేకాదు 1988 తర్వాత టెన్నిస్‌లో ఆడుతున్న అతి పెద్ద వయసున్న ఆటగాడు కూడా.


ALSO READ:  ఆ ఒక్క పరుగు చేస్తే బాగుండేది: రోహిత్ శర్మ

స్పెయిన్ రైజింగ్ స్టార్‌ 22 ఏళ్ల కార్లోస్ అల్కరాస్ మాంచి దూకుడు మీద ఉన్నాడు. ఈ ఏడాదిలో జరిగిన ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీల్లో విజేత నిలిచాడు. వింబుల్డన్ ఫైనల్‌లో జకోవిచ్‌ను ఓడించి టైటిల్ ఎగురేసు కుపోయాడు. దీంతో ఇరువురు ఆటగాళ్ల మధ్య మరో ఆసక్తిపోరు జరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.

అల్కరాస్ కెరీర్‌లో తొలి ఒలింపిక్స్‌ కాగా, ఫైనల్‌కు చేరుకున్నాడు. జకోవిచ్‌ అనుభవంతో పోల్చితే అల్కరాస్ చాలా చిన్నోడు. కాకపోతే మైదానంలో అల్కరాస్ దూకుడు మరోలా ఉంటుంది. ప్రత్యర్థికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడు. గడిచిన ఫ్రెంచ్, వింబుల్డన్‌లో ఆయన ఆటతీరును గమనించినవాళ్లు మాత్రం మరో ఫెదరర్ అంటూ కితాబు ఇచ్చారు. మరి పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం ఎవరిదో చూడాలి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×