BigTV English

ENG vs AFG: ఇంగ్లాండ్ ఓటమికి అతడే కారణమా..? ఆ వ్యూహం ఫలించిందా?

ENG vs AFG: ఇంగ్లాండ్ ఓటమికి అతడే కారణమా..? ఆ వ్యూహం ఫలించిందా?

ENG vs AFG: రామాయణ యుద్ధంలో విభీషణుడ్ని ఉద్దేశించి రావణాసురుడు ఒక మాటంటాడు. ‘ఇంటి గుట్టు చెప్పి లంకకే చేటు తెచ్చావు కదరా విభీషణా!’ ఇప్పుడిదే మాట ఇంగ్లాండ్-ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ కి కూడా వర్తిస్తుంది.
ఎందుకంటే ఒక మాజీ ఇంగ్లండ్ ప్లేయర్ ఈరోజు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ జట్టు ఓటమికి కారణమయ్యారు. ఇప్పుడదే హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారింది.


విషయం ఏమిటంటే ఆ మాజీ క్రికెటర్ పేరు ట్రాట్. 2011 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసినతను ఇప్పుడు ఆఫ్గన్ కోచ్ గా ఉన్నారు. ఇప్పుడా మాజీ ఆటగాడి సూచనలు బాగా పనిచేశాయని అంతా అంటున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్ ఆటగాళ్ల వీక్ నెస్ లన్నీ అతనికి తెలుసు. ఎవరికే బాల్ వేయాలి? ఎలా వికెట్ రాబట్టాలనేవన్నీ బాగా ఆఫ్గాన్ ప్లేయర్లకి నూరిపోశాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక బజ్ బాల్ ఆటని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్, అదే టెక్నిక్ తో ఆడిన ఆఫ్గాన్ చేతిలో మట్టి కరిచింది. ఇంతకీ బజ్ బాల్ అంటే దొరికిన బాల్ ని దొరికినట్టు బాదాలనే కాన్సెప్ట్ తో  మొదలు పెట్టారు. అంటే ఇది టీ20 మ్యాచ్ లకి సూట్ అవుతుంది కానీ 50 ఓవర్లకి సెట్ కాదని అనుకునేవారు. కానీ ఇంగ్లండ్ ఏం చేసిందంటే టెస్ట్ మ్యాచుల్లో కూడా ప్రవేశపెట్టి చితక్కొట్టడం మొదలు పెట్టింది. ఇప్పుడు దాన్ని అందరూ వంట పట్టించుకున్నారు. అందుకే ఆఫ్గాన్ ఓపెనర్ గుర్భాజ్ ఈ బజ్ బాల్ ఆట ఆడి… 57 బంతుల్లో 80 పరుగులు చేసి బ్రహ్మాండమైన బిగినింగ్ ఇచ్చాడు. చూశారా…ఎవరు తీసుకున్న గోతిలో వారే పడటమంటే ఇదేనేమో…కదా…!


Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×