E-Paper
Advertisement

CM Jagan : దసరా రోజు విశాఖకు షిఫ్టింగ్ ఉందా ? మంత్రి బొత్స వ్యాఖ్యలకు అర్థమేంటి ?

CM Jagan : దసరా రోజు విశాఖకు షిఫ్టింగ్ ఉందా ? మంత్రి బొత్స వ్యాఖ్యలకు అర్థమేంటి ?
Advertisement

CM Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ విశాఖకు షిఫ్ట్ కావడంపై ఇంకా సందిగ్ధం వీడడం లేదు. ఈ నెల 23న ముహూర్తం ఖరారు చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో అధికారుల్లో అయోమయం నెలకొంది. ఈ నెల 19నే సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అటు డిసెంబర్ 30వరకు రాజధాని అమరావతి కేసు ఉన్న నేపథ్యంలో.. అప్పటి వరకు సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదన్న ప్రచారం కూడా ఉంది.

ఇక మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ నెల 23నే సీఎం జగన్ రావాలని లేదు.. రేపే రావచ్చు, నవంబర్ లో రావచ్చు, డిసెంబర్ లో రావచ్చు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అయ్యే విషయంపై సందిగ్థత నెలకొంది. చాలావరకూ ఈ దసరాకు సీఎం విశాఖకు షిఫ్ట్ అవ్వడం అసాధ్యమన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విశాఖలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. వివిధ శాఖల ఆఫీస్ లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×