BigTV English

England in Quarter Finals : ఎదురులేని ఇంగ్లాండ్

England in Quarter Finals : ఎదురులేని ఇంగ్లాండ్

England in Quarter Finals : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌ జోరు కొనసాగుతోంది. ప్రీక్వార్టర్స్‌లో సెనెగల్‌ను 3-0 గోల్స్ తేడాతో చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్ చేరింది… ఇంగ్లాండ్‌. అందరి అంచనాలను నిలబెడుతూ మెగా టోర్నీ చరిత్రలో పదోసారి ప్రీక్వార్టర్స్‌ దాటి… తమను ఎందుకు టైటిల్‌ ఫేవరెట్ అంటారనేది చాటి చెప్పింది.


ఈ వరల్డ్‌కప్‌లో గోల్స్ వేటలో దూసుకెళ్తోన్న ఇంగ్లాండ్… సెనెగల్‌పై ఏకపక్ష విజయం సాధించింది. ఆట 38వ నిమిషంలో జోర్డాన్‌ హెండర్సన్‌, ఆట 48వ నిమిషంలో కెప్టెన్‌ హ్యారీ కేన్‌, 57వ నిమిషంలో బుకాయో సాకా గోల్ కొట్టడంతో… 3-0 గోల్స్ ఆధిక్యంలో నిలిచింది… ఇంగ్లాండ్. గోల్స్‌ చేయకపోయినా… జూడ్‌ బెల్లింగ్‌హామ్‌, ఫోడెన్‌ అద్భుతంగా ఆడుతూ సహచరులకు బంతి అందించి నెట్‌లోకి వెళ్లేలా చేశారు. ముఖ్యంగా మిడ్‌ఫీల్డ్‌లో చురుగ్గా కదిలిన బెల్లింగ్‌హామ్‌.. ప్రత్యర్థి జట్టుకు చిక్కకుండా బంతిని పాస్‌ చేసి గోల్స్‌ అవకాశాలు సృష్టించాడు.

మరోవైపు సెనెగల్ కూడా ఇంగ్లండ్ గోల్ పోస్టుల మీద దాడులు కొనసాగించింది. పలుసార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చినా, సెనెగల్ వృథా చేసుకుంది. ఇంగ్లిష్‌ ఆటగాళ్లను దాటుకుని గోల్‌పోస్టుకు దగ్గరగా దూసుకెళ్లిన బోలాయె… గోల్‌ కొట్టినంత పని చేశాడు. అతని మెరుపు షాట్‌ను గోల్‌కీపర్‌ జోర్డాన్‌ పిక్‌ఫోర్డ్‌ ఒంటి చేత్తో అద్భుతంగా అడ్డుకున్నాడు. అతను అడ్డుపడకపోతే… సెనెగల్‌ ఖాతా తెరిచేదే. ఆ తర్వాత కూడా కనీసం ఒక్క గోలైనా చేసేందుకు సెనెగల్‌ తీవ్రంగా కష్టపడింది. 74వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను ఆ జట్టు ఆటగాడు పాపె సార్‌ వృథా చేశాడు. ఆ తర్వాత చివరి వరకూ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని ఇంగ్లాండ్‌… 3-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే 12 గోల్స్ చేసిన ఇంగ్లాండ్‌… అత్యధిక గోల్స్‌ కొట్టిన జట్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌తో తలపడనుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×