Big Stories

ODI : సిరీస్ పై బంగ్లాదేశ్ గురి.. గెలుపు కోసం టీమిండియా ఆరాటం..

ODI : బంగ్లాదేశ్ -టీమిండియా మధ్య మిర్ పుర్ వేదికగా రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో సంచలన విజయం సాధించిన బంగ్లాదేశ్ అదే జోరు కొనసాగించేందుకు ఉత్సాహంగా ఉంది. తొలి మ్యాచ్ లో విజయం చేజారడంతో రోహిత్ సేనపై ఒత్తిడి ఉంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం. గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే రెండో వన్డేలో గెలవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది.

- Advertisement -

బ్యాటర్లు రాణించాలి
తొలి వన్డేలో రాహుల్ మినహా మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఓపెనర్ శిఖర్ ధావన్ గత మ్యాచ్ లో పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా అనూహ్యంగా అవుట్ అయ్యాడు. రోహిత్, అయ్యర్ క్రీజులో కుదురుకున్నాక పెవిలియన్ కు చేరారు. రెండో వన్డేలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా లాంటి ఆల్ రౌండర్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్ లో ఇదే పరిస్థితి తలెత్తింది. అందుకే టాప్ ఆర్డర్ పైనే భారం ఉంది.

- Advertisement -

బౌలర్లు మెరవాలి
తొలివన్డేలో బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యం ఉన్నా గట్టిగా పోరాడారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్, శార్ధుల్ ఠాకూర్, దీపక్ చాహర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు. అయితే కొత్త బౌలర్ కులదీప్ సేన్ కీలక సమయంలో రెండు వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చేశాడు. స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. అయితే రెండో వన్డేలో బౌలింగ్ లో మార్పులు చేసే అవకాశం ఉంది. కులదీప్ సేన్ కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. షాబాజ్ అహ్మద్ స్థానంలో పిట్ నెస్ ఉంటే అక్షర్ పటేల్ జట్టులోకి రావచ్చు.

సిరీస్ పై బంగ్లా గురి
రెండో వన్డేలో గెలిచి భారత్ పై రెండో సిరీస్ ను కైవసం చేసుకోవాలని బంగ్లాదేశ్ పట్టుదలతో ఉంది. గత మ్యాచ్ లో చూపించిన తెగువనే రెండో వన్డేలోనూ ప్రదర్శించేందుకు బంగ్లా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. తొలి వన్డేలో ఆ జట్టు బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేసినా బ్యాటర్లు అంతగా రాణించలేదు. కేవలం 8 పరుగుల తేడాతో 5 వికెట్లు చేజార్చుకుంది. ఓటమి అంచువరకు వెళ్లి అదృష్టం కలిసిరావడంతోపాటు మెహదీ హసన్ మెరుపులతో తొలి వన్డేలో ఓటమి తప్పింది. మిర్ పుర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు కాస్త సహకరించే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News