END Vs IND 3rd Test: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టు సిరీస్ లో భాగంగా ఇవాళ లార్డ్స్ వేదికగా 3వ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఇంగ్లాండ్.. రెండో టెస్టులో భారత్ విజయాలు సాధించాయి. మూడో టెస్టులో గెలిచిన జట్టు ఆధిక్యం కనబరుస్తోంది. అయితే మూడు టెస్టుల్లో కూడా ఇంగ్లాండ్ జట్టే టాస్ గెలవడం విశేషం. మూడో టెస్టులో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక భారత జట్టు తొలుత ఫీల్డింగ్ చేయనుంది. తొలి రెండు టెస్టు మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచినప్పటికీ పిచ్ వాతావరణాన్ని బట్టి బౌలింగ్ చేసింది. టీమిండియాలో ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చారు. దీంతో ముగ్గురు డేంజర్ బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇంగ్లీషు బ్యాటర్లకు ఇక నరకమే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం విశేషం.
Also Read : Vaibhav Suryavanshi Fans : ఒక్కరు కాదు.. ఏకంగా ఇద్దరు అమ్మాయిలతో 14 ఏళ్ళ వైభవ్ ఎంజాయ్!
జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీ..
ఇప్పటి వరకు బ్యాట్స్ మెన్ పై ఆధారపడితే.. ఈ సారి మాత్రం మ్యాచ్ గెలుపు బౌలర్ల పైనే ఆధారపడనుంది. భారత్, ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా ఈ మ్యాచ్ కోసం పేస్ బౌలర్లను రెడీ చేశారు. ఏ రోజునైనా మ్యాచ్ ని ఒంటరిగా మలుపు తిప్పగల సత్తా ఉన్న బౌలర్లు వీళ్లు. భారత్ పేస్ బౌలింగ్ దళంలో బుమ్రాతో పాటు ఆకాశ్ దీప్, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు. ఇక ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో ఆకాశ్ దీప్ 10 వికెట్లు తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అలాగే సిరాజ్ కూడా 7 వికెట్లు తీసి.. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లను కట్టడి చేశాడు. మరోవైపు ప్రసిద్ధ్ ఎడ్జ్‌బాస్టన్ రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. దీంతో అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇంగ్లాండ్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్‌కు జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. 2019 యాషెస్ సిరీస్‌లో ఇదే మైదానంలో జోఫ్రా ఆర్చర్ బౌన్సర్‌తో స్టీవ్ స్మిత్‌ను గాయపరచి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే, ఇప్పుడు అతనికి 30 ఏళ్లు దాటాయి. అతని ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు ఉన్నాయి. అతనితో పాటు బ్రైడాన్ కార్స్, క్రిస్ వోక్స్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు. మొత్తానికి లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ పేసర్ల మధ్య హోరా హోరీ పోటీ నెలకొననున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక హోరా హోరీగా జరిగే ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరీ.
టీమిండియా జట్టు :
జైస్వాల్, రాహుల్, కరుణ్ నాయర్, శుబ్ మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, సిరాజ్, బుమ్రా, నితిశ్ రెడ్డి. ః
ఇంగ్లాండ్ జట్టు :
క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, బెన్ స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.