Vaibhav Suryavanshi Fans : టీమిండియా అండర్ -19 క్రికెటర్ వైభవ్ సూర్య వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇతను 14 సంవత్సరాల వయస్సులోనే రికార్డులను కొల్లగొడుతున్నాడు. క్రికెట్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా ఇతని ఇన్నింగ్స్ ఉండటం విశేషం. తన దూకుడు బ్యాటింగ్ తో ఈ చిచ్చపిడుగు నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై వైభవ్ సూర్య వంశీ 31 బంతుల్లోనే సెంచరీ చేసి అందరి అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. ఇక ఆ తరువాత ఇటీవల జరిగిన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ అండర్-19 వన్డే యూత్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 వన్డే మ్యాచ్ ల సిరీస్ లో వైభవ్ బ్యాట్ నుంచి 355 పరుగులు వచ్చాయి.
Also Read : MI VS DC: ముంబై ఇండియన్స్ కాదు అంపైర్ ఇండియన్స్..ఒకే మ్యాచ్ లో 3 తప్పిదాలు
అండర్ -19లో ఫాస్టెస్ట్ సెంచరీ..
నాలుగో వన్డే మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 143 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో వైభవ్ కేవలం 52 బంతుల్లో అండర్ -19 వన్డే చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసాడు. పాకిస్తాన్ కి చెందిన కమ్రాన్ గులాం 2013లో 53 బంతుల్లో చేసిన సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ 52 బంతుల్లోనే శతకం బాది.. ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అండర్ -19లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా బంగ్లాదేశ్ బ్యాటర్ నజ్ముల్ శాంటో పేరిట ఉన్న రికార్డును కూడా వైభవ్ బ్రేక్ చేశాడు. ఈ సెంచరీ తరువాత సమయానికి వైభవ్ సూర్యవంశీ వయస్సు 14 సంవత్సరాల 100 రోజులే కావడం గమనార్హం. అతి చిన్న వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఇంత చిన్న ఏజ్ లో ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా ఇలా రెచ్చిపోలేదు. వైభవ్ కి మాత్రమే ఆ రికార్డు సాధ్యం అనే చెప్పాలి.
క్రేజ్ మామూలుగా లేదుగా..
ఐపీఎల్ లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ పట్ల అభిమానం భారత్ లోనే కాదు.. ఇంగ్లాండ్ లో కూడా విస్తరించింది. అభిమానులు కేవలం వైభవ్ సూర్యవంశీని చూసేందుకు చాలా దూరం నుంచి స్టేడియాలకు వస్తుండటం విశేషం. ప్రస్తుతం భారత అండర్ -19 జట్టు తరుపున ఇంగ్లాండ్ లోనే ఉన్న వైభవ్ సూర్యవంశీని కలిసేందుకు ఇద్దరూ అభిమానులు దాదాపు 6 గంటల పాటు ప్రయాణించి మరీ వచ్చారు. ఇద్దరూ అమ్మాయిలు వైభవ్ తో ఫొటో దిగేందుకు చాలా కష్టపడి వచ్చినట్టు తెలిపారు. ఆ అమ్మాయిలు రాజస్థాన్ రాయల్స్ జెర్సీలు ధరించి మరీ వచ్చి వైభవ్ తో కలిసి ఫోటోలు దిగారు. ఇక అభిమానుల స్టోరీ ని రాజస్థాన్ రాయల్స్ తన సోషల్ మీడియా లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైభవ్ సూర్యవంశీ ఇద్దరమ్మాయిలతో ఫోటో దిగడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేయడం విశేషం. వైభవ్ కి వచ్చే ఐపీఎల్ సీజన్ లో భారీ డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.