BigTV English

Trains Cancel: ఆగష్టులో 16 రైళ్లు క్యాన్సిల్, వీటిలో మీ రైళ్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి!

Trains Cancel: ఆగష్టులో 16 రైళ్లు క్యాన్సిల్, వీటిలో మీ రైళ్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి!

Indian Railways: భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకరంగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే, పలు కారణాలతో ఇండియన్ రైల్వే కొన్ని రైళ్లను క్యాన్సిల్ చేస్తుంది. కొన్నిసార్లు దారి మళ్లిస్తుంది. ఆయా మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లపై ఈ ఎఫెక్ట్ పడుతుంది. రైళ్ల రద్దుకు కొన్ని అనివార్య కారణాలు అడ్డంకిగా మారగా, మరికొన్ని సార్లు ఆయా పనుల కోసం రైళ్లను రద్దు చేయాల్సి వస్తుంది. అంటే టెక్నికల్ సమస్యలను పరిష్కరించడం, ట్రాక్ మరమ్మతులు లాంటి పలు కారణాల వల్ల రైళ్లు క్యాన్సిల్ అవుతాయి.


ఆగష్టులో పలు రైళ్లు రద్దు

వచ్చే నెలలో 16 రైళ్ల ను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. త్వరలో మీరు ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే, రద్దయిన రైళ్ల వివరాలను తెలుసుకోవాలని సూచించింది. ఒకవేళ మీరు వెళ్లాల్సిన రైళ్లు ఉంటే ప్రత్యామ్నాయ రైళ్లను చూసుకోవాలని వెల్లడించింది. ఇంతకీ వచ్చే నెలలో రద్దయ్యే రైళ్లు ఏవంటే..


ఆగస్టు 18  నుంచి సెప్టెంబర్ 10 వరకు రద్దయ్యే రైళ్ల జాబితా 

⦿ రైలు నంబర్ 18175/18176 హటియా – ఝార్సుగూడ – హటియా మెము ఎక్స్‌ప్రెస్ క్యాన్సిల్.

⦿ రైలు నంబర్ 17007 చర్లపల్లి – దర్భంగా ఎక్స్‌ప్రెస్ (వయా – రాంచీ) ఆగస్టు 26, సెప్టెంబర్9న రద్దు.

⦿ రైలు నంబర్ 17008 దర్భంగా – చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ (వయా – రాంచీ) ఆగస్టు 29, సెప్టెంబర్ 12న రద్దు.

⦿ రైలు నంబర్ 18523 విశాఖపట్నం – బనారస్ ఎక్స్‌ప్రెస్ (వయా – రాంచీ) ఆగస్టు 27 , 31, సెప్టెంబర్ 7, 10న క్యాన్సిల్.

⦿ రైలు నంబర్ 18524 ​​బనారస్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (వయా – రాంచీ) ఆగష్టు 28, సెప్టెంబర్ 1, 8,11న క్యాన్సిల్.

⦿ రైలు నంబర్ 17005 హైదరాబాద్ – రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ (వయా – రాంచీ) ఆగస్టు 28న రద్దు.

⦿ రైలు నంబర్ 17006 రక్సౌల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (వయా – రాంచీ) ఆగస్టు 31న రద్దు.

Read Also: 1,000 కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్, బుల్లెట్ రైలు సేవలు ఎప్పటి నుంచి అంటే?

⦿ రైలు నంబర్ 07051 చర్లపల్లి – రక్సౌల్ స్పెషల్ (వయా – రాంచీ) ఆగస్టు 30న రద్దు.

⦿ రైలు నంబర్ 07052 రక్సౌల్ – చర్లపల్లి స్పెషల్ (వయా – రాంచీ) సెప్టెంబర్ 2, 2025న రద్దు.

⦿ రైలు నంబర్ 07005 చర్లపల్లి – రక్సౌల్ స్పెషల్ (వయా – రాంచీ) సెప్టెంబర్ 1న రద్దు.

⦿ రైలు నంబర్ 07006 రక్సౌల్ – చర్లపల్లి స్పెషల్ (వయా – రాంచీ) సెప్టెంబర్ 4న రద్దు.

⦿ రైలు నంబర్ 18310 జమ్మూ తావి – సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ (వయా – రాంచీ) సెప్టెంబర్ 7న రద్దు.

⦿ రైలు నంబర్ 18309 సంబల్పూర్ – జమ్మూ తావి ఎక్స్‌ప్రెస్ (వయా – రాంచీ) సెప్టెంబర్ 9న రద్దు.

ఒకవేళ మీరు ప్రయాణం చేయాలనుకుంటే ఈ రైళ్లను మినహాయించి ఇతర రైళ్లలో మీరు ప్రయాణించేలా ఏర్పాటు చేసుకోవాలని రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also: జపానోళ్లది బుర్రే బుర్ర.. ఎయిర్ లైన్స్ లోకి అదిరిపోయే టెక్నాలజీ, ఇది ఊహించలేరు!

Related News

Trains cancelled: 68 రైళ్లు రద్దు, 24 తిరిగి ప్రారంభం.. ఆ లైన్ లో ఊరట కలిగించిన రైల్వే ప్రకటన..!

Railways TC: అబ్బా.. ఎవరీ హ్యాండ్సమ్.. నెట్టింట వైరల్ అవుతున్న రైల్వే టీసీ వీడియో!

New Visa Rules: వీసా నిబంధనలు మరింత కఠినతరం, ఇక ఆ దేశానికి వెళ్లడం అంత ఈజీ కాదు!

Special Trains: పండుగ సీజన్ కోసం మరో 150 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్!

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Big Stories

×