BigTV English

ENG vs SCO, T20 World Cup 2024 Highlights: ఫలితం తేలని ఇంగ్లండ్- స్కాట్లాండ్ మ్యాచ్

ENG vs SCO, T20 World Cup 2024 Highlights: ఫలితం తేలని ఇంగ్లండ్- స్కాట్లాండ్ మ్యాచ్

England vs Scotland Highlights, T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ లో ఒకటి.. వర్షం అంతరాయం కారణంగా.. ఫలితం తేలకుండా ఆగిపోయింది. వెస్టిండీస్ లోని బ్రిడ్జిటౌన్ లో ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంకా ఫలితం తేలలేదు. మ్యాచ్ ప్రారంభం కావడమే వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైంది.


టాస్ గెలిచిన స్కాట్లాండ్ ముందుగా బ్యాటింగ్ దిగింది. 6.2 ఓవర్ల ఆట జరగ్గానే వర్షం వచ్చింది. దాంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు. అప్పటికి వికెట్  నష్టపోకుండా 51 పరుగులు చేసింది. తర్వాత మళ్లీ ఆట మొదలైంది. 10 ఓవర్లు గడిచేసరికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులతో నిలిచింది.

అయితే ఆ 10 ఓవర్లయినా సరే, ఇంగ్లాండ్ తో ఆడించాలని అంపైర్లు చూశారు. సాధ్యం కాలేదు. వర్షం వచ్చి పోతూ ఉండటంతో గ్రౌండ్స్ మెన్లు పలు అవస్థలు పడ్డారు. వర్షం రాగానే కవర్ పట్టుకు రావడం, వర్షం తగ్గగానే మళ్లీ తొలగించడం ఇలా నానా పాట్లు పడ్డారు. మొత్తానికి ఒకసారి పిచ్ రెడీ చేసేసరికి మళ్లీ వర్షం రావడంతో వారి ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను చూస్తుంటే ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు.


మొదట బ్యాటింగ్ ప్రారంభించిన స్కాట్లాండ్ ఓపెనర్లు అదరగొట్టారు. ఒక్క వికెట్ నష్టపోకుండా 10 ఓవర్లలో 90 పరుగులు చేశారు. జార్జ్ మున్సే (41 నాటౌట్), మైఖేల్ జోన్స్ (45 నాటౌట్) ఇద్దరూ ఫటాఫట్ ఫోర్లు, సిక్సర్లతో దడదడలాడించారు. కానీ వర్షం వచ్చి మ్యాచ్ కు అంతరాయం కలిగించింది. దీంతో ఫలితం తేలలేదు.

Also Read: ఫ్రెంచ్ ఓపెన్‌లో తప్పుకున్న ప్రపంచ నెంబర్ వన్ జకోవిచ్

మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయంలో  టాస్ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ఒకవేళ టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నామని తెలిపాడు. కాకపోతే టాస్ ఓడిపోయాం. అయినా సరే, మేం కోరుకున్నదే దక్కిందని ఆనందంగా చెప్పాడు. ఈ టోర్నీలో విజయం సాధించాలని అందరం ఆత్రుతగా ఉన్నామని తెలిపాడు.  జోఫ్రా ఆర్చర్ మళ్లీ జట్టులోకి రావడం సంతోషంగా ఉందని తెలిపాడు.   ఈ మ్యాచ్‌లో తాము ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగినట్టు తెలిపాడు.

పిచ్ విషయంలో స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ మాటలు చూస్తే, ఇంగ్లండ్ కెప్టెన్ మాటలకి విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే టాస్ గెలిచి తాము బ్యాటింగ్ తీసుకున్నట్టు తెలిపాడు. అయితే సెకండ్ బ్యాటింగ్ కి వచ్చేసరికి పిచ్ టర్న్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఆ పరిస్థితి రాకుండానే మ్యాచ్ ఆగిపోయిందని అన్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ సందర్భాన్ని బట్టి విలువైన పరుగులు చేయాలని తెలిపాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×