BigTV English

ENG Won by 10 Wickets against USA: చిత్తుగా ఓడిన అమెరికా.. సెమీస్ కి చేరిన ఇంగ్లండ్ జట్టు!

ENG Won by 10 Wickets against USA: చిత్తుగా ఓడిన అమెరికా.. సెమీస్ కి చేరిన ఇంగ్లండ్ జట్టు!

T20 World Cup 2024 – England Won by 10 Wickets against United States: టీ 20 ప్రపంచకప్ లో సూపర్ 8 నుంచి ఇంగ్లండ్ సెమీస్ కి చేరినట్టుగానే అనుకోవాలి. గ్రూప్ దశ నుంచి చచ్చీచెడి గెలిచిన ఇంగ్లండ్ సూపర్ 8లో అమెరికాపై అద్భుతమైన రన్ రేట్ తో ఆడి ముందడుగు వేసింది. 9.4 ఓవర్లలోనే 117 పరుగులు చేసి, విజయం సాధించింది. నెట్ రన్ రేట్ 1.992 తో  రేస్ లో  నిలిచింది. అయితే సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ పై ఇంగ్లండ్ సెమీస్ ఎంట్రీ ఆధారపడి ఉంది.


సూపర్ 8లో భాగంగా అమెరికా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య కింగ్స్ టన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 9.4 ఓవర్లలోనే 117 పరుగులు చేసి జయభేరి మోగించింది.

వివరాల్లోకి వెళితే.. 116 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ సాధికారికంగా ఆడింది. ఓపెనర్లు ఇద్దరూ భయం లేకుండా ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ జోస్ బట్లర్ అయితే కళ్లు మూసుకుని ఆడినట్టు ఆడాడు. 38 బంతుల్లో 7 సిక్స్ లు, 6 ఫోర్ల సాయంతో 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.


Also Read: టీమిండియా సెమీస్ చేరాలంటే అలా జరగాల్సిందే..?

మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 21 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. మొత్తానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలో 117 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

అమెరికా బౌలింగులో హర్మీత్ సింగ్ 2 ఓవర్లలో 36 పరుగులు సమర్పించు కున్నాడు. ఒక ఓవర్ లో అయితే జోస్ బట్లర్ 5 సిక్స్ లు కొట్టడం విశేషం. ఒక్క బౌలరు కూడా వికెట్ తీయలేకపోయాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగు అన్నింటా అమెరికా దారుణంగా విఫలమైంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన అమెరికా ఏ దశలోనూ పోరాట పటిమ చూపించలేదు. పాకిస్తాన్ ని ఓడించి, టీమ్ ఇండియాని వణికించిన జట్టేనా? ఇది అని అంతా అనుకున్నారు. ఓపెనర్లు స్టీవెన్ టేలర్ (12),  ఆండ్రిస్ గౌస్ (8) చేసి అవుట్ అయిపోయారు. తర్వాత వచ్చిన నితీష్ కుమార్ (30) కాసేపు పోరాడి అవుట్ అయిపోయాడు.

Also Read: Afghanistan win by 8 runs on bangladesh: బంగ్లాదేశ్‌పై సంచలన విజయం, సెమీస్‌లో ఆఫ్గాన్, ఇంటికి ఆస్ట్రేలియా

కెప్టెన్ ఆరోన్ జోన్స్ (10), ఆండర్సన్ (29), మిలింద్ కుమార్ (4),  హర్మీత్ సింగ్ (21) చేశారు. తర్వాత ముగ్గురు ఆలిఖాన్, కెనిగే, నేత్రావల్కర్ వరుసగా డక్ అవుట్లు అయ్యారు. అందులో ఇద్దరు గోల్డెన్ డకౌట్లు అయ్యారు. దీంతో 18.5 ఓవర్లలో 115 పరుగులకి అమెరికా కథ ముగిసిపోయింది.

ఇంగ్లండ్ బౌలింగులో రీస్ టోప్లే 1, సామ్ కర్రన్ 2, ఆదిల్ రషీద్ 2, లివింగ్ స్టోన్ 1, జోర్డాన్ 4 వికెట్లు పడగొట్టారు.

Tags

Related News

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్… బీసీసీఐ సంచలన నిర్ణయం.. బాయ్ కాట్ చేస్తూ

Shahidi Afridi : ఫైనల్స్ లో షాహిన్ ఆఫ్రిది 5 వికెట్లు తీయడం పక్కా… రాసి పెట్టుకోండి.. ఇండియాకు నిద్ర లేకుండా చేస్తాం

Shoaib Akhtar : అభిషేక్ శర్మ మనిషి కాదు… వాడో జంతువు.. పాకిస్తాన్ తట్టుకోవడం కష్టమే

Asia Cup 2025 : పాకిస్తానీల అరాచకాలు.. గ్రౌండ్ లోనే లేడీ అభిమాని ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు!

IND Vs PAK : ఫైనల్స్ లో పాకిస్థాన్ ప్లేయర్స్ కు యానిమల్ మూవీ చూపించడం పక్కా..?

India vs Pakistan, Final: పాకిస్థాన్ కు ఘోర అవ‌మానం..ఫోటో షూట్ కు సూర్య డుమ్మా…వేయిట్ చేస్తున్న స‌ల్మాన్ ?

Harshit Rana – Gambhir : టీమిండియాకు అస‌లు విల‌న్‌ హర్షిత్ రాణానే..గంభీర్ వ‌ల్లే ఈ చెత్త ప్లేయ‌ర్ ఆడుతున్నాడంటూ ట్రోలింగ్‌

IND VS PAK, Final: ఫైన‌ల్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ‌..అభిషేక్ శర్మ, పాండ్యా ఔట్ ?

Big Stories

×