E-Paper
Advertisement

T20 Worldcup : T20 వరల్డ్ కప్ విజేత ఇంగ్లండ్..రెండోసారి టైటిల్ కైవసం

T20 Worldcup : T20 వరల్డ్ కప్ విజేత ఇంగ్లండ్..రెండోసారి టైటిల్ కైవసం
Advertisement

T20 Worldcup: టీ20 వరల్డ్ కప్ ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను చిత్తు చేసింది. ఇది ఇంగ్లండ్ కు రెండో టీ20 ప్రపంచ కప్ టైటిల్. గతంలో వెస్టిండీస్ మాత్రమే ఈ ఘనత సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే చేధించింది.

మరోసారి హీరో స్టోక్స్

Advertisement

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. సెమీస్ లో చెలరేగి ఆడిన హేల్స్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పిల్ సాల్ట్, బట్లర్ వెంటవెంటనే పెవిలియన్ కు చేరడంతో ఒక దశలో 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే స్టోక్స్, బ్రూక్స్ జట్టు స్కోరు ముందుకు నడిపించారు. బ్రూక్స్ అవుట్ తర్వాత మొయిన్ అలీతో కలిసి స్టోక్స్ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. మొయిన్ అలీ అవుట్ అయినా స్టోక్స్( 52 పరుగులు) అజేయంగా నిలిచి జట్టుకు టీ20 వరల్డ్ కప్ ను అందించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ల లో కెప్టెన్ బట్లర్ 26 పరుగుల , హారీ బ్రూక్స్ 20 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీష్ రౌఫ్ 2 వికెట్లు, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, మహమ్మద్ వాసిమ్ తలో వికెట్ పడగొట్టారు.

తడబడిన పాక్ బ్యాటర్లు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే సాధించింది. ఆ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. షాన్ మసూద్ (38 పరుగులు) కెప్టెన్ బాబర్ అజామ్ (32 పరుగులు) మాత్రమే కాస్త మెరుగ్గా ఆడారు. చివరల్లో షాదాబ్ ఖాన్ ( 20 పరుగులు) జట్టు స్కోర్ పెంచేందుకు ప్రయత్నించాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో పాకిస్థాన్ స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఇంగ్లండ్ ముందు ఉంచింది.

Advertisement

ఇంగ్లండ్ బౌలింగ్ భళా
ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. శామ్ కరన్ 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ వెన్ను విరిచాడు.అదిల్ రషీద్ , క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. బెన్ స్టోక్ కు ఒక వికెట్ దక్కింది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×