BigTV English

Ex Team India Cricketer : మాజీ టీమిండియా క్రికెటర్ కారుకు యాక్సిడెంట్..

Ex Team India Cricketer : మాజీ టీమిండియా క్రికెటర్ కారుకు యాక్సిడెంట్..


Ex Team India Cricketer : మాజీ ఇండియన్ బౌలర్ ప్రవీణ్ కుమార్, తన కుమారుడు భారీ ప్రమాదం నుండి బయటపడ్డారు. వారు కారులో వెళ్తుండగా.. మీరత్ సమీపంలో ఒక ట్రైలర్ ట్రక్ వచ్చి వారి కారును ఢీకొట్టింది. మీరత్‌లోని కమీషనర్ ఇంటి సమీపంలో స్పీడ్‌గా వచ్చిన ఈ ట్రక్.. ప్రవీణ్ కారును వెనుక నుండి ఢీకొట్టిందని జాతీయ మీడియా ప్రకటించింది.

ప్రవీణ్ కుమార్ కారు యాక్సిడెంట్ గురించి విన్నవారు.. గతేడాది డిసెంబర్‌లో రిషబ్ పంత్‌కు జరిగిన యాక్సిడెంట్‌కు గుర్తుచేసుకుంటున్నారు. టీమిండియాలో వికెట్ కీపర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ కారులో వెళ్తుండగా.. ఢిల్లీ, డెహ్రాడూన్ హైవే వద్ద యాక్సిడెంట్ అయ్యి తీవ్ర గాయాలపాలయ్యాడు. చాలారోజులు చికిత్స అందుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలుగా నడవగలుగుతున్నాడు. ప్రవీణ్ కుమార్ యాక్సిడెంట్ గురించి వింటుంటే రిషబ్ పంత్ యాక్సిడెంట్ గుర్తొస్తుంది అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్.


ప్రవీణ్ కుమార్‌ కారుకు జరిగిన ప్రమాదంలో తనకు, తన కుమారుడికి ఎలాంటి గాయాలు కాలేదని, సేఫ్‌గా బయటపడ్డారని తెలుస్తోంది. 2007 నుండి 2012 మధ్యలో ప్రవీణ్.. ఆరు టెస్టులు, 68 ఓడీఐలు, 10 టీ20లు ఆడాడు. 2018 అక్టోబర్‌లో క్రికెట్ నుండి ప్రవీణ్ తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. ‘నా సమయం అయిపోయింది. నేను దానిని ఒప్పుకుంటున్నాను’ అని రిటైర్‌మెంట్ తీసుకున్నాడు.

2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ఓడీఐలో శ్రీలంకతో తలబడింది టీమిండియా. ఈ మూవీ సిరీస్‌ల ఓడీఐలో ప్రవీణ్ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. శ్రీలంక స్కోర్‌ను డిఫెండ్ చేసే విషయంలో ప్రవీణ్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత తను రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్న సమయంలో తన కెరీర్ హైయెస్ట్ పాయింట్‌లో ఉన్నానని, తనకు సంతోషంగా ఉందని చెప్తూ రిటైర్‌మెంట్ విషయం బయటపెట్టాడు ప్రవీణ్ కుమార్.

Related News

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Big Stories

×