BigTV English

Rohit Sharma’s fan gets real treatment US police: రోహిత్‌శర్మకు హగ్ ఇచ్చిన అభిమాని, రంగంలోకి పోలీసులు..

Rohit Sharma’s fan gets real treatment US police: రోహిత్‌శర్మకు హగ్ ఇచ్చిన అభిమాని,  రంగంలోకి పోలీసులు..

Rohit Sharma’s die hard fan gets real treatment US police: ఉగ్ర ముప్పు నేపథ్యంలో ఇండియా ఆడే ప్రతీ టీ 20 మ్యాచ్‌కు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు న్యూయార్క్ పోలీసులు. అంతేకాదు ఏ ఆటగాడు బయటకు వెళ్లినా ముగ్గురు నలుగు పోలీసులు వెంటే ఉంటున్నారు. ఐసీసీ నిర్వాహకులు, లోకల్ గవర్నర్ చొరవ మేరకు ఆటగాళ్లకు భారీ భద్రత కల్పించారు.


న్యూయార్క్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రాక్టీసు మ్యాచ్ జరిగింది. టీమిండియా జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ రోహిత్‌శర్మ వీరాభిమాని మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. రోహిత్‌కు హగ్ కూడా ఇచ్చేశాడు. హఠాత్ పరిణామంతో షాకయ్యారు న్యూయార్క్ పోలీసులు.

వెంటనే పోలీసులు మైదానంలోకి వచ్చిన అతగాడ్ని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి గమనించిన రోహిత్‌శర్మ పోలీసులకు రిక్వెస్ట్ చేశాడు. తన అభిమాని అని ఏమీ అనవద్దని వారిని వివరించాడు. దీంతో మైదానం నుంచి అతగాడ్ని బయటకు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. అభిమానిని బయటకు తీసుకెళ్లిన తర్వాత మ్యాచ్ కంటిన్యూ అయ్యింది.


Rohit Sharma die hard fan gets real treatment from US police in Warmup match
Rohit Sharma die hard fan gets real treatment from US police in Warmup match

అభిమాని వ్యవహారశైలిపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌ ఆడేటప్పుడు ఆటగాళ్లకు చాలా ఒత్తిళ్లు ఉంటాయని అంటున్నారు. ఈ సమయంలో అభిమాని మైదానంలోకి చొచ్చుకొని రావడంతో ఆటగాళ్ల మూడ్ డైవర్ట్ చేసిందని అంటున్నారు. కాకపోతే మ్యాచ్ చూడటానికి వచ్చిన‌వారిలో ఎక్కవమంది టీమిండియా మద్దతుదారులు ఉన్నారు. అక్కడి పరిస్థితి గమనించిన రోహిత్‌శర్మ, పోలీసులకు విన్నవించాడు.

 

Tags

Related News

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Big Stories

×