T20 వరల్డ్‌కప్ తర్వాత న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు వెళ్లనుంది… టీమిండియా. అయితే… ఈ రెండు టూర్ల కోసం ప్రకటించిన జట్లలో భారత స్టార్ బౌలర్ బుమ్రా పేరు లేకపోవడంతో… ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. అసలు బుమ్రాకు ఏమైంది? అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడా? లేక ఐపీఎల్ మాత్రమే ఆడాలనుకుంటున్నాడా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బుమ్రా… ఇప్పటిదాకా 30 టెస్ట్‌లు, 72 వన్డేలు, 56 టీ20లు మాత్రమే ఆడాడు. ఆరేళ్ల కెరీర్‌లో బుమ్రా ఆడిన మ్యాచ్‌లు ఇన్నేనా? అని ఫ్యాన్స్ చాలా అసహనంగా ఉన్నారు. అదే ఐపీఎల్ తీసుకుంటే… 2013 నుంచి లీగ్ లో ఆడుతున్న బుమ్రా… ప్రతి సీజన్‌లోనూ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా… ఏకంగా 120 మ్యాచ్‌లు ఆడాడు. దాంతో… ఐపీఎల్‌పై ఉన్న శ్రద్ధ అంతర్జాతీయ మ్యాచ్ ల మీద లేదా? అని బుమ్రాపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
T20 వరల్డ్‌కప్‌కు ముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ బుమ్రా… నెలలు గడుస్తున్నా జట్టులోకి తిరిగి ఎందుకు రాలేదంటూ ఫ్యాన్స్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. రెస్ట్ అనో లేక గాయాల పేరుతోనో కీలక సిరీస్‌లకు అందుబాటులో ఉండకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. T20 వరల్డ్‌కప్ కోసం హడావుడిగా జట్టులోకి వచ్చిన బుమ్రా… అంతే స్పీడ్ గా ఎగ్జిట్ అయ్యాడంటూ సెటైర్లు వేస్తున్నారు. అసలు బుమ్రాకు అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్… ఐపీఎల్ మాత్రమే ఆడాలనుకుంటే రిటైర్మెంట్ ప్రకటించి అందులోనే ఆడుకోమని సలహా ఇస్తున్నారు. ఆసియా కప్ నుంచి T20 వరల్డ్ కప్ దాకా సరైన ఫాస్ట్ బౌలర్ లేక జట్టు ఓడిపోతుంటే… బుమ్రాకు పట్టదా? అని నిలదీస్తున్నారు. దేశం కోసం ఆడను… డబ్బులొస్తేనే ఆడతాను… అనే వైఖరితో ఉంటే… ఐపీఎల్లోనే సెటిలైపొమ్మని బూమ్రాకు సూచిస్తున్నారు… ఫ్యాన్స్.