Inzamam-ul-Haq On IND VS PAK: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s U19 Asia Cup 2026 Tournament) సందర్భంగా ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India U19 vs Pakistan U19, 8th Match) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. గ్రూప్ స్టేజ్ లో భాగంగా జరిగిన ఈ దాయాదుల పోరులో పాకిస్తాన్ సూపర్ విక్టరీ అందుకుంది. దీంతో టీమిండియా జూనియర్ జట్టును ఉద్దేశించి సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు.
ఇండియా అంటే పడని వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐసీసీ టోర్నమెంట్లలో తప్పా మిగతా ఎక్కడ మ్యాచ్ లు జరిగిన టీమిండియా పై పాకిస్తాన్ విజయం సాధిస్తుందని తెలిపాడు. ఐసీసీ ఉన్నాడని.. అతని వల్ల ఐసీసీ టోర్నమెంట్ లో భాగంగా మ్యాచ్ ఎక్కడ జరిగినా టీమ్ ఇండియా గెలుస్తూ వస్తోందని ఆరోపించాడు. దీనిపై ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు.
అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఓటమిపై ఇంజమామ్ ఉల్ హక్ తన స్టైల్లో స్పందించాడు. ఐసీసీ టోర్నమెంట్స్ లలో తప్ప ఇండియా మిగతా ఈవెంట్లలో చిత్తుగా ఓడిపోతోందని దీని వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించాడు. ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉన్న నేపథ్యంలో టీమిండియాకు అనుకూలంగా పిచ్ లు మార్చుతున్నాడని విమర్శలు చేశాడు. అందుకే ఐసీసీ టోర్నమెంట్స్ ఎక్కడ జరిగినా 2024 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ పై టీమ్ ఇండియా గెలుస్తూ వస్తోందని గుర్తు చేశాడు. కానీ మిగతా టోర్నమెంట్లలో పాకిస్తాన్ గెలిచిన విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి అని తెలిపాడు.
మొన్న జరిగిన హాంకాంగ్ సిక్సెస్ లో భాగంగా టీమ్ ఇండియాను పాకిస్తాన్ ఓడించిందని…. ఇప్పుడు అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా నిన్న జరిగిన గ్రూప్ స్టేజ్ లో కూడా పాకిస్తాన్ విక్టరీ సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇతర టోర్నమెంట్లలో టీమిండియా కు అనుకూలంగా మైదానాలు ఉండబోవని… అందుకే వరుసగా ఓడిపోతూ వస్తున్నారని బాంబు పేల్చాడు. అదే ఐసీసీ టోర్నమెంట్లలో ఫ్లాట్, హైవే లాంటి మైదానాలు ఉండడంతో అవలీలకు గెలుస్తున్నారని విమర్శలు చేశాడు. ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉన్నన్ని రోజులు.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని వ్యాఖ్యానించాడు. వెంటనే దీనిపై ఐసీసీ పెద్దలు విచారణ చేయాలని డిమాండ్ చేశాడు. లేకపోతే ఇతర క్రికెట్ బోర్డులు తీవ్రంగా నష్టపోతాయని వ్యాఖ్యానించాడు.
ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంటు 2026లో భాగంగా ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జూనియర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా జూనియర్ జట్టు 208 పరుగులకు కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని ఏడు వికెట్లు నష్టపోయి పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు చేరుకుంది.