Fatima Sana: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 T20 World Cup tournament) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మహిళల (India Women vs Pakistan Women) జట్ల మధ్య ఇవాళ గ్రూప్ స్టేజ్ లో కీలక మ్యాచ్ జరగనుంది. ఎడ్జ్ బస్టన్ వేదికగా ( Edgbaston, Birmingham) ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana). టీం ఇండియాను చిత్తు చిత్తుగా ఇవాళ్టి మ్యాచ్ లో ఓడిస్తామని సంచలన ప్రకటన చేశారు. టీమిండియాతో నరకం స్పెల్లింగ్ రాయిస్తామంటూ ఛాలెంజ్ విసిరారు. దీంతో ఫాతిమా సనా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో (2026 T20 World Cup tournament) భాగంగా మరి కాసేపట్లో టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India Women vs Pakistan Women) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టి 20 మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జరిగే మ్యాచ్ లో టీమ్ ఇండియాను వందలోపు ఆల్ ఔట్ చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ బౌలర్లు వేసే బంతులకు.. టీమిండియా ప్లేయర్లు వణికి పోవాల్సిందేనంటూ హెచ్చరించారు. గతంలో ఓటమికి ఇప్పుడు అధికారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. టీమిండియా కు నరకం చూపించే వరకు నిద్రపోబోము వివాదాస్పద వ్యక్తులు చేశారు. దీంతో ఫాతిమా సనా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. దమ్ముంటే ఇవాళ్టి మ్యాచ్ లో టీమిండియాని ఓడించి, చూపించాలంటూ కౌంటర్లు ఇస్తున్నారు. వందలోపు కాదు… మీరు 50లోపు ఆల్ అవుట్ కాకుండా చూసుకోవాలని చురకలు అంటిస్తున్నారు.
పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India Women vs Pakistan Women) మధ్య మ్యాచ్ నేపథ్యంలో కాసేపటి క్రితమే బాబర్ ఆజం ( Babar Azam) ఆసక్తికర పోస్ట్ పెట్టారు. టీమిండియాను ఓడించాల్సిన సమయం దగ్గర పడిందని… అందరు కలిసికట్టుగా ప్రత్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు. పురుషుల జట్టు… టీమిండియాను ఓడించ లేకపోయిందని, ఇప్పుడు ఆ బాధ్యతను పాకిస్తాన్ లేడీ టీం తీసుకోవాలని వెల్లడించారు. ఫాతిమా సనా ఆధ్వర్యంలో పాకిస్తాన్ గెలవాలని కోరారు. దీంతో బాబర్ ఆజం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.