E-Paper
Advertisement

సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. 130 అడుగుల ఎత్తు నుంచి యువతిని తోసేసి..

సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. 130 అడుగుల ఎత్తు నుంచి యువతిని తోసేసి..
Advertisement

Bungee Jump Tragedy: సాహస క్రీడలు ప్రాణాల మీదకు తెస్తున్నాయనడానికి తాజాగా బ్రెజిల్‌లో జరిగిన ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం. బంజీ జంపింగ్ చేయడానికి వెళ్లిన ఒక 21 ఏళ్ల యువతి, అక్కడి సిబ్బంది చేసిన ఘోర నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. కేవలం సేఫ్టీ రోప్ కట్టడం మర్చిపోయి ఆమెను కిందకు వదిలేయడంతో, ఆమె 130 అడుగుల ఎత్తు నుండి లోయలో పడి అక్కడికక్కడే మరణించింది.

Read also-ఫ్రిడ్జ్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చితే.. కరెంట్ బిల్లు తగ్గడంతో పాటు రిఫ్రిజిరేటర్ లైఫ్ కూడా పెరుగుతుంది!

కళ్లెదుటే జరిగిన ఘోరం

Advertisement

బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలో ఉన్న ‘స్కెలిటన్ బ్రిడ్జ్’ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరియా ఎదువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ (21) అనే యువతి తన కాబోయే భర్త తో కలిసి బంజీ జంప్ చేయడానికి అక్కడికి వెళ్ళింది. బ్రిడ్జ్ అంచున నిలబడిన ఆమెకు జంపింగ్ గేర్ అమర్చిన సిబ్బంది, అత్యవసరమైన మెయిన్ సేఫ్టీ రోప్‌ను కనెక్ట్ చేయడం పూర్తిగా మర్చిపోయారు. ఆ విషయాన్ని గమనించకుండానే ఆమెను బ్రిడ్జ్ పైనుంచి కిందకు వదిలేశారు.

ఆమె దూకిన సెకన్లలోనే తాడు లేదనే విషయాన్ని గమనించిన అక్కడి ప్రత్యక్ష సాక్షులు “తాడు.. తాడు చూడండి” అని గట్టిగా అరిచేలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. మరియా దాదాపు 130 అడుగుల ఎత్తు నుండి కింద ఉన్న రాళ్లపై పడిపోయింది. కళ్లెదుటే ఈ దారుణాన్ని చూసిన ఆమె కాబోయే భర్త తీవ్ర దిగ్భ్రాంతికి గురై కళ్లు తిరిగి పడిపోయారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Read also-తరచూ కోపం వస్తోందా? మీ జీవితాన్ని మార్చేసే ’90-సెకన్ల రూల్’ ఇక్కడుంది!

సోషల్ మీడియాలో..

ఈ ప్రమాదం జరగడానికి కేవలం కొద్ది నిమిషాల ముందే మరియా ఆ బ్రిడ్జ్ పరిసరాలను, తన చేతికి ఉన్న జంప్ బ్యాండ్స్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “నన్ను ఈ బ్రిడ్జ్ పైనుంచి దూకడానికి అనుమతించిన ఆ పిచ్చి వ్యక్తి ఎవరు?” అంటూ ఆమె సరదాగా రాసుకొచ్చిన ఆఖరి క్యాప్షన్, ఇప్పుడు నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది.

ఆరుగురు సిబ్బంది అరెస్ట్

ఈ ఘటనపై బ్రెజిల్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. నిర్లక్ష్యం కారణంగా జరిగిన హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థకు చెందిన ఆరుగురు సిబ్బందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. సాహస పర్యాటక ప్రాంతాల్లో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Related News

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. తీవ్రత 7.1 గా నమోదు, వందలాది బుల్లెట్ రైళ్లు రద్దు

13 రోజుల బాంబుల వర్షం తర్వాత క్లైమాక్స్… ట్రంప్ నిర్ణయంతో మారిపోయిన సీన్!

సిరియాలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 35 మంది మృతి, 30 మందికి పైగానే గాయాలు

కెనడాలోనూ ఉన్మాదమే.. ప్రేయసిని చంపిన ఇండియన్ ప్రియుడు.. ఏం జరిగిందంటే?

ఒకే ఇంట్లో భార్యాభర్తలు.. కానీ 20 ఏళ్లుగా మాటలు కట్.. ఎందుకో తెలిస్తే షాక్!

1100 రోజులుగా జైల్లోనే ఇమ్రాన్ ఖాన్.. ‘మిస్ యూ డాడీ’ అంటూ.. కుమారుడు ఆసక్తికర పోస్ట్!

Big Stories

Advertisement
×