BigTV English

Sarfaraz Khan: ఆటలో అలాంటివి సహజం.. రనౌట్‌పై స్పందించిన సర్ఫరాజ్..

Sarfaraz Khan: ఆటలో అలాంటివి సహజం.. రనౌట్‌పై స్పందించిన సర్ఫరాజ్..
Sarfaraz Khan Runout

Sarfaraz Khan Runout: టీమ్ ఇండియా ఆరంగ్రేటం ప్లేయర్ సర్ఫరాజ్ ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో లేట్ గా క్రీజులోకి వచ్చినా, లేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడి, అందరి మనసులు గెలుచుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో సర్ఫరాజ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటలో రనౌట్లు సహజంగా జరుగతుంటాయని తెలిపాడు. ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్ అని అన్నాడు. అయితే జడేజా వల్లనే తను ఆఫ్ సెంచరీ చేయగలిగానని, తన పెద్ద మనసును చాటుకున్నాడు.


నేను కొత్త, తను సీనియర్, అందుకే క్రీజులో ఉన్నంత సేపు, నాకు ధైర్యాన్నిస్తూ, ప్రోత్సహిస్తూనే ఉన్నాడని అన్నాడు. తనని చూస్తూ, ఆ కాన్ఫిడెన్స్ తోనే ఎటాకింగ్ ప్లే ఆడానని తెలిపాడు.

‘నా తండ్రి సమక్షంలో ఆడటం, నా జీవితంలో మరిచిపోలేనని అన్నాడు. అంతేకాదు టీమ్ ఇండియా ఆరంగ్రేటం క్యాప్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా అందుకోవడం కూడా ఒక గొప్ప విషయమేనని అన్నాడు. అందరూ ఆశీర్వదించడం వల్లే, ఆప్ సెంచరీ చేయగలిగానని అన్నాడు.


Read More: సర్ఫరాజ్ రనౌట్.. క్యాప్ నేలకేసి కొట్టిన రోహిత్..

భారత జట్టుకి ఆడాలని అందరూ అనుకుంటారు. అది నా కల. ఈ రోజుకి నెరవేరిందని ఆనందంగా తెలిపాడు. సుమారు 4 గంటల పాటు ప్యాడ్లు కట్టుకొని అలా కూర్చున్నాను. క్రీజులోకి వెళ్లగానే, మాట్లాడుతూ ఉండమని జడ్డూ భాయ్‌కు చెప్పాను.

నా భయం పోగొట్టుకోవడానికి ఆ ట్రిక్ ఫాలో అయ్యానని తెలిపాడు. మొదట్లో చిన్న టెన్షన్ పడ్డాను. అయితే ఇది అంతర్జాతీయ మ్యాచ్ కాదు, నేను ఎప్పుడూ ఆడే క్రికెట్, అక్కడెలా ఆడుతానో, ఇక్కడాంతే, అని మనసుకి సర్దిచెప్పుకుని ఆడినట్టు తెలిపాడు.

మొదట మానాన్న గ్రౌండ్ కి రానన్నారు. కానీ ఫ్రెండ్స్ చెప్పడంతో వచ్చారు. నేను టీమ్ ఇండియాకు ఆడాలని, అందుకోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. మమ్మల్ని తీర్చిదిద్దడానికి మాకన్నా ముందు లేచేవారు. ఆయన పడిన కష్టం నేడు నెరవేరింది. ఆయన భుజాలపై భారం తగ్గిందని అనుకుంటున్నాని తెలిపాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×