BigTV English
Advertisement

Ben Cutting – RCB: ఆ రాక్షసుడు వస్తున్నాడు..రోజుకు 150 మెసేజ్ లు..ఇక RCBకి పీడకలే

Ben Cutting – RCB: ఆ రాక్షసుడు వస్తున్నాడు..రోజుకు 150 మెసేజ్ లు..ఇక RCBకి పీడకలే

Ben Cutting – RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా మ్యాచ్లను గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు దూసుకెళ్లింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఈసారి ఎలాగైనా.. కప్పు గెలవాలని… ముందుకు వెళ్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును గతంలో ఎదుర్కొన్న రాక్షసుడు రంగంలోకి దిగబోతున్నాడు.


ఆర్సిబిని ఢీకొట్టేందుకు వస్తున్న రాక్షసుడు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కు 2016లో పీడకల మిగిలిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఫైనల్ దాకా వెళ్ళిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆశలను నిరాశ చేశాడు బెన్ కట్టింగ్. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అప్పట్లో ప్రాతినిధ్యం వహించిన బెన్ కట్టింగ్… RCB పై ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి… కోహ్లీ సేనకు పీడకల మిగిల్చాడు రాక్షసుడిలా బ్యాటింగ్ చేసి…. కోహ్లీ సేనకు విజయాన్ని దూరం చేశాడు బెన్ కట్టింగ్. అయితే అలాంటి రాక్షసుడు ఇప్పుడు మళ్ళీ జట్టులోకి వస్తున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.


పంజాబ్ కింగ్స్ లోకి బెన్ కట్టింగ్ వస్తున్నాడంటూ ప్రచారం ?

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు డేంజర్ ఆటగాడు బెన్ కట్టింగ్.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ చేరడంతో అతని ప్రస్తావన మళ్ళీ తెరపైకి వచ్చింది. దానికి తగ్గట్టుగానే.. బెన్ కట్టింగ్ కూడా తాజాగా కీలక ప్రకటన చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వ్యతిరేకంగా ఆడాలని తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. అలాగే రోజుకు 150 మెసేజ్లు కూడా పంపిస్తున్నారని.. సోషల్ మీడియా బెన్ కట్టింగ్ వెల్లడించాడు. తనను ఫాలో అవుతున్న instagram ఫాలోవర్స్ అందరూ ఇదే విషయాన్ని.. స్పష్టం చేస్తున్నట్లు వివరించాడు.

ఎలాగైనా ఐపిఎల్ 2025 టోర్నమెంట్లో పంజాబ్ జట్టు తరఫున బరిలోకి దిగాలని తనను కోరుతున్నారని… స్పష్టం చేశాడు బెన్ కట్టింగ్. మాక్స్వెల్ స్థానంలో… పంజాబ్ తరఫున బరిలో దిగాలని కోరుతున్నారు అంటూ వెల్లడించాడు. 2016 సమయంలో ఎలా ఆడావో… అలా ఆడి బెంగళూరు ను ఇంటికి పంపించేయ్ అంటూ తనకు మెసేజ్లు వస్తున్నట్లు చెప్పుకొచ్చాడు బెన్ కట్టింగ్. ఇది ఇలా ఉండగా 2016 ఐపిఎల్ టోర్నమెంట్ సమయంలో బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అప్పుడు బెంగళూరు గెలుస్తుందని అందరూ అనుకున్న సమయంలో చివర్లో బ్యాటింగ్ వచ్చి బెన్ కట్టింగ్ చుక్కలు చూపించాడు. కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు బెన్ కట్టింగ్. అటు బౌలింగ్ లో కూడా గేల్, కేల్ రాహుల్ ను అవుట్ చేసి.. హైదరాబాద్ ను గెలిపించాడు. ఈ నేపథ్యంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు బెన్ కట్టింగ్.

Related News

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

Big Stories

×