Big Breaking:బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంట్లోకి గుర్తుతెలియని ఆగంతకులు చొరబడడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ముఖ్యంగా ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా భయపడి పోయిన సల్మాన్ ఖాన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే గతంలో కూడా చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్ కి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఆ ఇద్దరు ఆగంతకులు ఇంట్లోకే ప్రవేశించడంతో సల్మాన్ ఖాన్ జీవితానికి ప్రాణహాని ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ పై ఇలా ఎవరో ఒకరు దాడి చేయడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి. ఇంకా ఆయన ఎన్ని రోజులు ఇలా ప్రాణభయంతో పోరాడుతూ ఉండాలని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
ఆ ఇద్దరి నిందితులలో..
అయితే సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులలో ఒకరు మహిళ కూడా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. సల్మాన్ పై హత్యకు దిగేంత కక్ష ఆ మహిళకు ఎక్కడిది? ఆమెను ఎవరైనా ప్రేరేపించారా? లేక మరేదైనా కారణమా? లేక డబ్బు కోసమే ఇదంతా చేస్తోందా? అంటూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కూడా సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నం..
ఇకపోతే సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నం ఇదేం మొదటిసారి కాదు. సల్మాన్ ఖాన్ నివసిస్తున్న బాంద్రా ఇంటిపై 2024 ఏప్రిల్ 15న కూడా ఆ తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. షూట్ చేసేందుకు వచ్చిన బైక్ ఘటన స్థలానికి కిలోమీటర్ దూరంలో పోలీసులకు లభ్యమయింది. ఇకపోతే ఆ ఘటనను ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సల్మాన్ ఖాన్ తో ఫోన్లో మాట్లాడి, ఆ ఘటనపై సమాచారం కూడా తెలుసుకున్నారు. ఆయనకున్న ప్రమాదాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే ముంబై పోలీస్ కమిషనర్ తో మాట్లాడి సల్మాన్ ఖాన్ నివాసానికి భద్రత పెంచాలని కూడా కోరారు. అలా ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఆ భద్రతను కూడా కాదనుకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఏకంగా ఆయన ఇంట్లోకే చేరబడి హత్యాయత్నానికి పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది తెలిసిన అభిమానులు ఆయన ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తోంది? ఇంట్లోకి వెళ్లి ఆయనపై దాడి చేసే వరకూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆగంతకులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. త్వరలోనే నిజానిజాలు బయటకు కక్కించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
also read:Bollywood: ఒకే ఇల్లు… రెండు బెడ్ రూంలు… ఈ నటికి భర్తకు దూరంగానే ఉంటేనే హ్యాపీ అంట