Homemade Serum For Face: బలమైన సూర్యకాంతి, వేడి గాలులు, చెమట, ధూళి కారణంగా, చర్మం నిర్జీవంగా మారడమే కాకుండా.. టానింగ్, మొటిమలు, నీరసం, ముడతలు వంటి సమస్యలు కూడా చర్మంపై ఏర్పడటం ప్రారంభిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో.. చర్మ సంరక్షణకు ఫేస్ సీరం చాలా బాగా ఉపయోగపడుతుంది . వంటగదిలో ఉన్న కొన్ని రకాల పదార్థాలతో ఎటువంటి రసాయనాలు లేకుండా ప్రభావ వంతమైన ఫేస్ సీరం తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. మీ చర్మానికి అనుగుణంగా మీరు ఇంట్లోనే ఫేస్ సీరం తయారు చేసుకుని వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకీ ఇంట్లోనే ఫేస్ సీరం ఎలా తయారు చేసుకోవాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోనే ఫేస్ సీరం తయారీ:
1. విటమిన్ సి సీరం:
విటమిన్ సి సీరం ముఖానికి మెరుపును ఇవ్వడమే కాకుండా చర్మం పొడిబారడాన్ని కూడా తొలగిస్తుంది. మీరు దీనిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే టానింగ్, పిగ్మెంటేషన్ , నల్లటి వలయాల సమస్య తగ్గుతుంది.
కావలసినవి:
1 టేబుల్ స్పూన్ కలబంద జెల్
1 స్పూన్ నిమ్మరసం
1 స్పూన్ రోజ్ వాటర్
2 విటమిన్ ఇ క్యాప్సూల్స్
తయారుచేసే విధానం:
పైన తీసుకున్న అన్ని పదార్థాలను బాగా కలిపి.. ఒక గాజు సీసాలో నిల్వ చేసి, ఫ్రిజ్‌లో ఉంచండి. మీరు దీనిని 7 రోజుల పాటు ఉపయోగించవచ్చు. అంతే కాకుండా దీనిని వాడటం వల్ల అద్భుతమైన లాభాలు ఉంటాయి.
ఎలా అప్లై చేయాలి:
రాత్రిపూట మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకుని.. మీ అరచేతులకు 3-4 చుక్కల సీరం రాసి.. మీ ముఖం అంతా అప్లై చేయండి. తర్వాత చేతులతో 2 నిమిషాలు మసాజ్ చేయండి.
ప్రయోజనాలు:
1. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
2. మచ్చలు, నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
3. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అంతే కాకుండా ఎండ దెబ్బతినకుండా రక్షణ కల్పిస్తుంది.
2. అలోవెరా-దోసకాయ సీరం:
దోసకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా జిడ్డుగల చర్మం ఉన్న వారికి ఇది ఒక వరంలాగా పనిచేస్తుంది. మీరు దీనిని కలబందతో కలిపి అప్లై చేస్తే.. మీకు రెట్టింపు ప్రయోజనం లభిస్తుంది. అంతే కాకుండా ఈ సీరం మీ చర్మంపై మొటిమల సమస్యను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
కావలసినవి:
2 టేబుల్ స్పూన్లు దోసకాయ రసం
1 టేబుల్ స్పూన్ కలబంద జెల్
2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్
తయారుచేసే విధానం:
దోసకాయ రసం తీసి కలబంద, టీ ట్రీ ఆయిల్ అందులో మిక్స్ చేయండి. తర్వాత దానిని స్ప్రే బాటిల్‌లో నింపండి.
ఎలా అప్లై చేయాలి: రోజుకు రెండుసార్లు ముఖంపై తేలికగా అప్లై చేయండి. మీకు కావాలంటే.. మీరు దానిని స్ప్రేగా కూడా ఉపయోగించవచ్చు.
ప్రయోజనాలు:
1. మొటిమలను తగ్గిస్తుంది.
2. చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా తాజాగా కూడా ఉంచుతుంది.
3. అదనపు నూనెను నియంత్రిస్తుంది.
4. రంధ్రాలను తగ్గిస్తుంది.
3. గ్రీన్ టీ-తేనె సీరం:
గ్రీన్ టీ యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తేనె టీ చర్మం ముడతలు, వదులుగా ఉండటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కావలసినవి:
2 టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ (చల్లబరిచిన)
1 స్పూన్ తేనె
1 స్పూన్ అలోవెరా జెల్.
Also Read: ఖరీదైన షాంపూలు అవసరమే లేదు.. వీటితో బెస్ట్ రిజల్ట్స్
తయారీ విధానం:
గ్రీన్ టీ తయారు చేసి చల్లారనివ్వండి. తర్వాత దానికి తేనె, కలబంద కలపండి. అనంతరం
గాలి చొరబడని సీసాలో నింపి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచండి.
ఎలా అప్లై చేయాలి: ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి ముఖం, మెడపై అప్లై చేయండి.
ప్రయోజనాలు:
1. ఫైన్ లైన్స్, ముడతలను తగ్గిస్తుంది
2. చర్మంలో దృఢత్వాన్ని కాపాడుతుంది.
3. చర్మ కణాలను రిపేర్ చేస్తుంది.