E-Paper
Advertisement

SRHలోకి హార్దిక్ పాండ్యా..ఆ రూ. 20 కోట్ల ప్లేయర్‌ను గెంటేసిన కావ్య పాప ?

SRHలోకి హార్దిక్ పాండ్యా..ఆ రూ. 20 కోట్ల ప్లేయర్‌ను గెంటేసిన కావ్య పాప ?
Advertisement

SRH-Hardik Pandya  : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ముంబై ఇండియన్స్ లో ఉన్న అతన్ని ట్రేడ్ ద్వారా తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ చాలా పోటీ పడుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇలాంటి తరుణంలోనే హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా తీసుకునేందుకు కావ్య పాప స్కెచ్ వేసినట్టు ప్రచారం సాగుతోంది.

ఈ మేరకు ఇప్పటికే కావ్య పాప, అనిరుధ్ ఇద్దరూ కలిసి.. ముంబై యాజమాన్యంతో మాట్లాడినట్టు ప్రచారం జోరందుకుంది. రూ.20.50 కోట్ల ప్లేయర్ పాట్ కమిన్స్ ను ముంబైకి ఇచ్చేసి, అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు డీల్ మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. ఇక సన్ రైజర్స్ ఆఫర్ ను రిజెక్ట్ చేయకుడా ముంబై యాజమాన్యం కూడా పచ్చ జెండా ఊపిందని అంటున్నారు. దీంతో ఐపీఎల్ 2027లో హార్దిక్ పాండ్యా  సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH) తరఫున బరిలోకి దిగుతాడని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అంతేకాదు, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ కూడా హార్దిక్ పాండ్యాకే ఇస్తారని కూడా అంటున్నారు.

హార్దిక్ పాండ్యాతో డీల్ సెట్ చేసింది అనిరుధేనా ?

Advertisement

ఐపీఎల్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను ఎలాగైనా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకురావాలని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ పట్టుబట్టినట్టు సమాచారం అందుతోంది. ఇటీవలే చెన్నై జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో హార్ధిక్ పాండ్యా, అనిరుధ్ రవి చంద్రన్ మధ్య చర్చ జరిగిందని అంటున్నారు. ఇక్కడే ఇద్దరూ మాట్లాడుకుని, కావ్య పాపతో చర్చించారని ప్రచారం సాగుతోంది. ఇక అనిరుధ్ చెప్పగానే ముంబై యాజమాన్యంతో మాట్లాడేందుకు కావ్య పాప నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ట్రేడ్ కుదిరినట్టు ప్రచారం సాగుతోంది.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

ఐపీఎల్ షెడ్యూల్, వేలం వివరాలు ఇవే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ కు సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తూనే ఉన్నాయి. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన వేలం తేదీ, వేదిక ఖరారైంది. గోవా వేదికగా ఐపీఎల్ 2027 వేలం డిసెంబర్ 16వ తేదీన జరుగనుంది. గతంలో దుబాయ్, సౌదీలలో వేలం జరుగగా, ఈ సారి మన దేశంలోనే నిర్వహిస్తున్నారు. నవంబర్ 15వ తేదీలోపు రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్ల లిస్టును 10 ఫ్రాంచైజీలు… ఐపీఎల్ కౌన్సిల్ కు అప్పగించాలి. ప్రాథమిక సమాచారం ప్రకారం 2027 మార్చి 10వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు కొనసాగనుందని అంటున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

Related News

నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

టెస్ట్ క్రికెట్ కు బుమ్రా ప‌నికిరాడు..గాయాలే అత‌డి కొంప‌ముంచుతున్నాయ్!

నువ్వు స్లాగ‌ర్ కాదు, రియ‌ల్ హీరో…అభిషేక్ శ‌ర్మ‌కు పాక్ బౌల‌ర్ క్ష‌మాప‌ణ‌లు

అభిషేక్, తిల‌క్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్లు..వాళ్లే లేక‌పోతే, టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

శుభమాన్ గిల్ త‌ల‌కు ఏమైంది? ఆ ఎల‌క్ట్రిక్ డివైజ్ ఎందుకు పెట్టుకున్నాడు

బంతులు వేస్తే, బ్యాట‌ర్ల ముక్కు, ద‌వ‌డ‌ల‌ నుంచి ర‌క్తం రావాలి…షోయ‌బ్ అక్తర్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×