India’s Super 8 Schedule in T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో లీగ్ మ్యాచ్ లు దాదాపు ముగిసిపోతున్నాయి. సూపర్ 8కి కూడా దాదాపు 6 దేశాలు క్వాలిఫై అయిపోయాయి. ఇంక ఇప్పుడు సూపర్ 8 లో మన టీమ్ ఇండియా మ్యాచ్ లు ఎప్పుడెప్పుడు. ఎవరెవరితో ఆడుతుందనే వాటిపై నెట్టింట పెద్ద చర్చ సాగుతోంది. బంగ్లాదేశ్ కూడా దాదాపు చేరినట్టే అనుకోవాలి. ఒకవేళ వారు ఓడినా 4 పాయింట్లతో ఆ జట్టే సూపర్ 8కి వస్తుంది.
ఆల్రడీ సూపర్ 8కి చేరిన టీమ్ ఇండియా, లీగ్ లో ఆఖరి మ్యాచ్ ని కెనడాతో నేడు ఆడనుంది. అయితే ఫ్లోరిడాలో పడుతున్న వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ జరగాల్సిన అమెరికా వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ కూడా ఇలాగే వర్షం కారణంగా రద్దయ్యింది. ఇకపోతే ఇక్కడ నుంచి టీమ్ ఇండియా డైరక్టుగా సూపర్ 8 ఆడేందుకు వెస్టిండీస్ బయలుదేరనుంది.
జూన్ 19 నుంచి సూపర్ 8 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.
టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ జూన్ 20న ఆఫ్గనిస్తాన్ తో ఆడనుంది.
జూన్ 22న రెండో మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరగనుంది.
జూన్ 24న మూడో మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది.
ఇక్కడ టీమ్ ఇండియా మొదట ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ లను ఓడిస్తే 4 పాయింట్లు వస్తాయి. కానీ ఇవి రెండు కూడా మొండి ఘటాల్లా ఉన్నాయి. అంటే మొండివాడు రాజుకన్నా బలవంతుడని అంటారు.
అలా రెండు జట్లు తయారయ్యాయి. అందుకని మనవాళ్లు ఒక్కడుగు వెనకడుగు వేస్తే, పాకిస్తాన్ కి పట్టిన గతే పడుతుంది. అమెరికాతో ఓడిపోవడమే వారి కొంప మీదకి వచ్చిందనే సంగతి అందరికి తెలిసిందే.
Also Read: పసికూన ఉగండాపై.. 5.2 ఓవర్లలో కివీస్ ఘనవిజయం
రేపు ఆఫ్గాన్, బంగ్లాదేశ్ వేటిపై ఓడినా టీమ్ ఇండియా పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో ఏసీ-డీసీ కాబట్టి ధైర్యంగా చెప్పలేని పరిస్థితులున్నాయి. అదీకాక వారు ఇలాంటి మెగా ఫైనల్ మ్యాచ్ లు అంటే, వారి ప్లానింగ్ వేరుగా ఉంటుంది.
అంతేకాకుండా ఓపెనర్లు, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ అంతా పటిష్టంగా ఉంది. బౌలింగు కూడా బాగుంది. అందువల్ల ఆస్ట్రేలియాను గెలవడం కత్తిమీద సాములాంటిదే. కాకపోతే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి బదులు తీర్చుకోవాలనే కసి ఉంటే మాత్రం..ఇండియా తప్పక గెలుస్తుందని అంటున్నారు.