Spirit: ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత సౌత్‌లోనే కాదు, నార్త్ ఇండియా, ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లాడు. భారి బడ్జట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కి ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా మారబోతోంది. ఈ సినిమాకు ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ సినిమా అంటే ఇంటెన్స్ యాక్షన్, పవర్‌ఫుల్ ఎమోషన్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఖాయం. ఇక ప్రభాస్ – పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి, ఈ సినిమాపై హైప్ అమాంతం పెరిగిపోయింది.
ఇప్పుడు ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావడానికి కొత్త అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. సినిమాలో ప్రభాస్ అన్నయ్యగా బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోవాలని చూస్తున్నారు, పైగా కొరియన్ హీరో డాన్లీ కూడా స్పిరిట్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, ‘స్పిరిట్’ కేవలం పాన్-ఇండియా మూవీ మాత్రమే కాదు, గ్లోబల్ లెవెల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మారిపోతుంది. సంజయ్ దత్ లాంటి సాలిడ్ సిక్స్ ఫీట్ కటౌట్ అదే రేంజ్ లో ఉండే ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే, ఈ ఇద్దరూ కలిసి చేసే యాక్షన్ సీన్స్ సినిమాకు మరింత మాస్ అండ్ ఎమోషనల్ డెప్త్ ని ఇస్తాయి.
సందీప్ రెడ్డి వంగా హీరోల క్యారెక్టరైజేషన్‌ను చాలా ఇంటెన్స్ గా డిజైన్ చేస్తాడు. ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ & అనిల్ కపూర్ మద్య వున్న ఫాదర్ – సన్ రిలేషన్ ఎంత పవర్‌ఫుల్ గా ఉందో అందరికీ తెలుసు. అలానే ‘స్పిరిట్’లో ప్రభాస్ – సంజయ్ దత్ మద్య బ్రదర్ బాండ్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తే ఫ్యామిలీ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది.
ప్రభాస్ మాస్ హీరోగా, సంజయ్ దత్ సీనియర్ ఇంటెన్స్ క్యారెక్టర్ గా, Don Lee విలన్ గా ప్రభాస్‌తో కలిసి ఫైట్ చేస్తే, ఈ సినిమా యాక్షన్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ‘స్పిరిట్’ ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమా, ఈ కాస్టింగ్ సెట్ అయితే ‘స్పిరిట్’ సినిమా ఇండియా టాప్ 3 హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ‘సలార్’ లాంటి సినిమాలు ఇప్పటికే ₹700-800 కోట్లు వసూలు చేశాయి. ‘యానిమల్’ లాంటి సినిమాలు ₹900 కోట్లు క్రాస్ చేశాయి. అయితే, ‘స్పిరిట్’ బాలీవుడ్ & కొరియన్ మార్కెట్ ని కలిపితే ₹2000 కోట్లు ఈజీగా దాటే ఛాన్స్ ఉంది.