Aakash Deep Enjoying Tea: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs Team India, 1st Test) మధ్య వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ ( Basin Reserve, Wellington) వేదికగా మొదటి టెస్ట్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో 100లోపే ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. మళ్లీ పికప్ అందుకుంది. ఈ క్రమంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ చేసిన ఓ పని కెప్టెన్ శుభమాన్ గిల్ కు (Shubman Gill ) కోపం తెప్పించింది. డ్రింక్స్ బ్రేక్ ముగిసిన తర్వాత.. బౌండరీ గేట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఆకాశ్ దీప్.. టీ తాగుతూ కనిపించాడు. లైవ్ మ్యాచ్ జరుగుతున్నప్పటికీ టీ గ్లాస్ మాత్రం వదిలి పెట్టకుండా ఫీల్డింగ్ చేస్తున్నట్టు నటించాడు. ఈ సమయంలో చూసిన గిల్.. బండ బూతులు తిట్టాడు. బౌండరీ గేట్ ఉన్న ఆకాశ్ దీప్ ను సర్కిల్ లోకి రమ్మని ఫీల్డింగ్ చేయించాడు. ఫీల్డింగ్ చేయమంటే టీ తాగుతావా? అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో ఈ సంఘటన వైరల్ గా మారింది.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ ఉదయం 3:30 గంటలకు తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ టెస్ట్ లో మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. ఈ దెబ్బకు వందలోపే ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్… పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ సమయంలో న్యూజిలాండ్ డేంజర్ ప్లేయర్ హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు జట్టును ఆదుకున్నారు. వికెట్ నష్టపోకుండా జట్టును ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో తొలి టెస్ట్ లో సూపర్ సెంచరీ నమోదు చేసుకున్నాడు హెన్రీ నికోల్స్. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ టీమిండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని 188 బంతుల్లో సెంచరీ ఫినిష్ చేశాడు… ఇందులో 12 బౌండరీలు కూడా ఉన్నాయి. సెంచరీ దిశగా దూసుకు వెళ్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి భాగస్వామ్యం 150 పరుగులు దాటింది. న్యూజిలాండ్ స్కోర్ 240 క్రాస్ అయ్యింది.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ ను పక్కకు పెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వన్డే సిరీస్ లో కూడా ఇలాగే అతన్ని పక్కకు పెట్టారని.. ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో అదే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్ గడ్డపై మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసేవాడని.. అలాంటోడిని పక్కకు పెట్టి… చెత్త బౌలర్లను ఆడిస్తున్నారని గంభీర్ తో పాటు గిల్ పై విమర్శలు చేస్తున్నారు.
🔴 SO, WHAT'S INDIAN PLAYER DOING DURING THE TEA BREAK? 🤣
– Aakash Deep was enjoying tea near the boundary even after the tea break was over.
– Meanwhile, Shubman Gill kept calling him, "Come on!"
– Even Glenn Phillips couldn't stop laughing at them. 🤣 pic.twitter.com/Ms5dp51rET
— Sam (@cricsam02) November 19, 2026