Gill Controversial DRS Decision Saves Glenn Phillips: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs Team India, 1st Test) మధ్య ఇవాళ టెస్ట్ సిరీస్ ( India tour of New Zealand 2026) షురూ అయింది. వెల్డింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ వేదికగా ( Basin Reserve, Wellington) ఉదయం 3:30 గంటల ప్రాంతంలో తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఇందులో టాస్ నెగ్గిన టీమిండియా మొదట బౌలింగ్ చేసేందుకు మొగ్గు చూపింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. భారత బౌలర్లు రెచ్చిపోవడంతో.. 100 లోపే ఐదు వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయితే ఈ మ్యాచ్ లో వివాదాస్పద డీఆర్ఎస్ నిర్ణయం ద్వారా గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) బతికిపోయాడంటూ టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Shubman Gill ) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తమకు అన్యాయం జరిగిందని, DRSలో ఏదో తప్పిదం జరిగిందంటూ అంపైర్ తో గొడవకు కూడా దిగాడు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ ఉత్కంఠ భరితంగా మారింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 31 ఓవర్ బుమ్రా సంధించాడు. ఈ ఓవర్ లో మూడవ బంతిని గ్లెన్ ఫిలిప్స్ ఎదుర్కోగా.. అది ప్యాడ్లకు తగిలింది. ఈ క్రమంలో ఎల్బీడబ్ల్యూ కోసం టీమిండియా ఆటగాళ్లు గట్టిగానే అప్పిల్ చేశారు. కానీ ఫీల్డ్ అంపైర్ రీఛర్డ్ ఎల్లింగ్ వర్త్ నాటౌట్ అంటూ నిర్ణయం తీసుకున్నాడు. అయినప్పటికీ బుమ్రాతో చర్చించి రివ్యూకు వెళ్లాడు కెప్టెన్ గిల్. అయితే రివ్యూలో బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు సైకో మీటర్ లో స్పైక్ కనిపించడం హాట్ టాపిక్ అయింది.
సాధారణంగా రీప్లేలో మాత్రం బ్యాట్ కు బంతి తగలనట్టుగానే గ్యాప్ ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. కానీ అల్ట్రా ఎడ్జ్ లో మొదట బ్యాట్ కు బంతి తగిలినట్టు కనిపించడంతో నాటౌట్ గా ప్రకటించారు. ఈ క్రమంలో బ్యాట్ కంటే ముందు ప్యాడ్లకు బంతి ముందుగా తగిలిందని ఫీల్డ్ అంపైర్ రీఛర్డ్ ఎల్లింగ్ వర్త్ తో గిల్ (Shubman Gill ) గొడవకు దిగాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ సంఘటన నేపథ్యంలో న్యూజిలాండ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తోందని ఇండియన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఔట్ అయినా, అంపైర్లు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. అంపైర్లు డబ్బులకు అమ్ముడుపోయారంటూ ఆరోపిస్తున్నారు.
The skipper isn't pleased! 😤
A tense moment in the middle as Shubman Gill makes his case to the umpire! 👀
Watch the HERO VIDA India Tour of New Zealand, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #NZvIND pic.twitter.com/Jlh2oa40fc
— Sony Sports Network (@SonySportsNetwk) November 19, 2026