E-Paper
Advertisement

Gautam Gambhir : ఇంతకంటే గొప్ప ముగింపు లేదు: గౌతం గంభీర్

Gautam Gambhir : ఇంతకంటే గొప్ప ముగింపు లేదు: గౌతం గంభీర్
Advertisement

Gautam Gambhir’s First Reaction on Rohit, Kohli, Jadeja Retirement: భావి భారత జాతీయ క్రికెట్ కోచ్ గా చెబుతున్న గౌతం గంభీర్ తాజాగా సీనియర్ల రిటైర్మంట్ పై స్పందించాడు. విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ముగ్గురూ కూడా కరెక్ట్ టైమ్ లో స్పందించారని అన్నాడు. ప్రపంచకప్ గెలిచిన అనంతరం వీడ్కోలు పలకడం కంటే గొప్ప ముగింపు మరొకటి ఉండదని అన్నాడు. అయితే వన్డే, టెస్టు ఫార్మాట్‌లో వారిద్దరు మరికొన్నాళ్లు కొనసాగాలని అన్నాడు.  జాతీయ జట్టుకి వారి అవసరాలు ఉన్నాయని అన్నాడు.

ఎంతో మంది కుర్రవాళ్లకు క్రీజులో ఉండి మార్గదర్శకం చేయాలని అన్నాడు. అందరూ బయటి నుంచి చెప్పేవారే ఉంటారు. కానీ క్రికెట్ ఆడుతూ ఆటలో లోటుపాట్లను స్వయంగా పరిశీలిస్తూ యువతరానికి మార్గదర్శనం చేసేవారి లాంటి క్రికెటర్లు తక్కువ మంది ఉంటారని అన్నాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో దేశం కోసం, జట్టు కోసం వారు కీలక పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నాను” అని గంభీర్ అన్నాడు.

Advertisement

మరికొద్ది రోజుల్లో భారత క్రికెట్ హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ బాధ్యతలు స్వీకరిస్తాడనేది అందరికీ స్పష్టమైంది. టీ 20 ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ వరకు చేరడంతో అందరి ఫోకస్ అటు పడింది. బీసీసీఐ కార్యదర్శి జైషాతో సహా పలువురు వెస్టిండీస్ వెళ్లి భారత జట్టుని ప్రోత్సహించారు. అందువల్ల కోచ్ పై స్పష్టత రాలేదు. మరోవైపు డబ్ల్యూవీరామన్ ఆలోచనలు కూడా బాగుండటంతో ప్రస్తుతం భారత క్రికెట్ సలహా కమిటీ డిఫెన్స్ లో పడినట్టు సమాచారం. అందుకే డబ్ల్యూ వీ రామన్ కి కూడా కీలక బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.

Also Read: బ్యాడ్మింటన్‌ టోర్నీలో విషాదం.. ఆడుతూ కోర్టులో.. చైనా ఆటగాడు మృతి

Advertisement

మరోవైపు గౌతంగంభీర్ స్పందించడంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోచ్ అన్నవాడు అలాగే ఉండాలని, అందరినీ కలుపుకొని పోవాలని సూచిస్తున్నారు. బయట మాట్లాడేది వేరు, ఆటగాడిగా జట్టుతో ఉండటం వేరు, ఒక గురువుగా మారి నడుచుకోవడం వేరని అంటున్నాడు. ఒక క్లాసులో స్టూడెంట్స్ అందరూ ఒకలా ఉండనట్టే, ఆటగాళ్లు కూడా అలా ఉండరని చెబుతున్నారు. వీళ్లందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత హెడ్ కోచ్ పైనే ఉందని, ఆ పని గంభీర్ బాగా చేశాడని మెచ్చుకుంటున్నారు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×