E-Paper
Advertisement

Germany Won:హాకీ ప్రపంచకప్‌ను ముద్దాడిన జర్మనీ

Germany Won:హాకీ ప్రపంచకప్‌ను ముద్దాడిన జర్మనీ
Advertisement

Germany Won:హోరాహోరీగా సాగిన హాకీ ప్రపంచకప్ ఫైనల్లో.. బెల్జియంపై జర్మనీదే పైచేయి అయింది. పెనాల్టీ షూటౌట్లో జర్మనీ 5 గోల్స్ సాధించి… ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది. దాంతో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం… రన్నరప్‌గా మిగిలిపోవాల్సి వచ్చింది. ఫైనల్లో గెలుపు కోసం రెండు జట్లు చివరి నిమిషం దాకా పోరాడాయి. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బెల్జియం… ఆట ఆరంభం నుంచే జర్మనీపై ఆధిపత్యం ప్రదర్శించింది. అయినా… జర్మనీ అసాధారణ ఆట తీరుతో ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది.

తొలి క్వార్టర్‌లో బెల్జియం ఆటగాళ్లు వాన్‌ అయిబెల్‌, టాంగీ కోసిన్స్‌ చెరో గోల్‌ చేసి జర్మనీపై ఒత్తిడి పెంచారు. రెండో క్వార్టర్‌లో జర్మనీ ఆటగాడు నిక్లస్‌ వెల్లెన్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. మూడో క్వార్టర్‌లో జర్మనీ మరో గోల్‌ సాధించడంతో… రెండు జట్లు చెరో రెండు గోల్స్‌తో సమానంగా నిలిచాయి. నాలుగో క్వార్టర్‌ మొదలైన మూడో నిమిషంలోనే జర్మనీ ఆటగాడు మాట్స్‌ గ్రాంబుష్‌ గోల్‌ చేసి బెల్జియంపై ఒత్తిడి పెంచారు. అయితే ఆట చివరి నిమిషంలో పెనాల్టి కార్నర్‌ను బెల్జియం గోల్‌గా మలచడంతో… ఇరు జట్లు చెరో 3 గోల్స్‌తో సమానంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. బెల్జియం నాలుగు గోల్స్‌ మాత్రమే చేయగా, జర్మనీ ఐదు గోల్స్‌ వేసి… ప్రపంచకప్‌ను సాధించింది. పురుషుల హాకీలో జర్మనీకి ఇది మూడో ప్రపంచకప్‌ టైటిల్.

Advertisement

మరోవైపు… సొంతగడ్డపై జరిగిన హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు 9వ స్థానంతో సరిపెట్టుకుంది. క్వార్టర్‌ ఫైనల్‌ కూడా చేరలేక నిరాశ పరిచిన భారత హాకీ టీమ్… చివరికి విజయంతో మెగా టోర్నీని ముగించింది. 9 నుంచి 12వ స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో… భారత్‌ 5–2 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. మరో మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 గోల్స్ తేడాతో వేల్స్‌ను చిత్తు చేయడంతో… భారత్, అర్జెంటీనా సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచాయి.

Related News

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

Big Stories

Advertisement
×