BigTV English

Glenn Maxwell: ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్ చెత్త రికార్డ్..

Glenn Maxwell: ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్ చెత్త రికార్డ్..

Maxwell’s Worst Record In IPL 2024: ముంబై తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘోరంగా ఆడింది. బ్రహ్మాండమైన బ్యాటింగ్ పిచ్ పై తడబడుతూ ఆడి 196 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇందులో ముగ్గురు డకౌట్లు అయ్యారు. వారిలో ఒకరు ప్రధాన బ్యాటర్ మ్యాక్స్ వెల్. అరవీర భయంకరుడు. క్రీజులో క్లిక్ అయితే చాలు ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల మొనగాడైన మ్యాక్స్ వెల్ ఇంకా ఫామ్ అందుకోలేదు. సరికదా ఒక చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు.


ముంబయి స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడబోయిన మ్యాక్స్వెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌటైన బ్యాటర్గా చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఇంక రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్ను  సమం చేశాడు. ఐపీఎల్ కెరీర్లో రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్ చెరో 17సార్లు డకౌట్ కాగా, మ్యాక్స్వెల్ తాజాగా వీరి సరసన చేరిపోయాడు.

Also Read: విరాట్ మాట విన్న అభిమానులు పాండ్యా కి నిరసనల బదులు జేజేలు


ఆర్సీబీలో పేపరు మీద చూస్తే అంతా అరవీర భయంకరమైన ఆటగాళ్లే కనిపిస్తున్నారు. కానీ క్రీజులో చూస్తే సున్నాలు చుట్టేస్తున్నారు. మొన్నటి వరకు కెప్టెన్ డుప్లెసిస్ కూడా ఆడలేదు. ఐదు మ్యాచ్ ల తర్వాత ఇప్పుడే లైనులో పడ్డాడు. 40 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇక భారీ అంచనాలతో 2024 ఐపీఎల్ బరిలో దిగిన మ్యాక్స్వెల్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన  చేయడం లేదు.

ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. రెండవది ఫీల్డింగ్ లో కూడా చురుగ్గా లేకపోవడంతో ఇషాన్ క్యాచ్ ఒకటి మిస్ అయ్యింది. అంటే అది కొంచెం టఫ్ క్యాచ్ కానీ, డైవింగ్ చేసే టైమింగ్ కరెక్టుగా సింక్ కాలేదు.

ఇక ఫీల్డింగ్ లో కూడా అన్యమనస్కంగానే చేశాడు.  ఈ సీజన్లో అప్పుడే మ్యాక్స్ వెల్ మూడుసార్లు డకౌటవ్వడం గమనార్హం. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.  ఆస్ట్రేలియా తరఫున ఆడినట్లు, ఆర్సీబీ తరఫున ఆడటం లేదని ఆరోపిస్తున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×