BigTV English

Love Me: జన్మనీ, మరణమును.. జంటగా మలిచావే.. అంతా శివ మాయ

Love Me: జన్మనీ, మరణమును.. జంటగా మలిచావే.. అంతా శివ మాయ

Love Me: దిల్ రాజు నట వారసుడు ఆశిష్ .. రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని సెల్ఫిష్ అనే సినిమాను ప్రకటించాడు. కానీ, ఈ సినిమా అనుకోని రీతిలో ఆగిపోయింది. ఈ మధ్యలోనే ఆశిష్ పెళ్లి పీటలు కూడా ఎక్కి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇక కొత్త జీవితం మొదలయ్యాక తన రెండో సినిమాను ప్రకటించాడు.. అదే లవ్ మీ.. ఇఫ్ యూ డేర్.


అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ సరసన వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆటగదరా శివా.. నీ మాయ అంటూ సాగిన ఈ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంది. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ కు .. కీరవాణి అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్.

ఇక ఈ సాంగ్ ను తన మెస్మరైజ్ వాయిస్ తో మనీషా మరింత హైప్ పెంచేసింది. చావు బతుకులను శివుడు ఎప్పుడో నిర్ణయించేశాడు.. ఈ మధ్యలో ఉన్న జీవితంలో ప్రతి మనిషి దేనికోసమో వెతుకుతున్నాడు అని జీవిత సత్యాన్ని లిరిక్స్ లో చెప్పాడు చంద్రబోస్. దెయ్యానికి, మనిషికి మధ్య ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఆశిష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×