No-Handshake: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టుకు ఘోర పరాభవం ఎదురయింది. టీమిండియాను ఉద్దేశించి ఆస్ట్రేలియా ప్లేయర్లు దారుణంగా ర్యాగింగ్ చేశారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో పాకిస్తాన్ క్రికెటర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎగతాళి చేసి ఓ వీడియో బయటకు వదిలారు. షేక్ హ్యాండ్ ( No-Handshake ) ఇవ్వకపోవడం టీమిండియా బలహీనత అంటూ ఆస్ట్రేలియా ( Australia) ప్లేయర్లు ర్యాగింగ్ చేసే ప్రయత్నం చేశారు.
Also Read: IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజయం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మన ర్యాంక్ ఎంతంటే
పాకిస్తాన్ క్రికెటర్లకు ( Pakistan) టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ( Handshake Stance) ఇవ్వకపోవడం చాలా తప్పు అంటూ ఆస్ట్రేలియా ప్లేయర్లు వీడియోను బయటకు వదిలారు. భారతీయులకు ట్రెడిషనల్ గ్రీటింగ్స్ అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం అస్సలు నచ్చదు… అది వారి బలహీనత అంటూ సెటైర్లు పేల్చే ప్రయత్నం చేసింది ఆస్ట్రేలియా. మనం బౌలింగ్ చేయకముందే వారిని ఓడించవచ్చు అంటూ ఆస్ట్రేలియా కు సంబంధించిన ఓ యాంకర్ ర్యాగింగ్ కూడా చేశారు. దీనికి బదులుగా ఆస్ట్రేలియా మెయిన్స్ అలాగే మహిళా క్రికెటర్లు సైగలు చేస్తూ ఇండియా పరువు తీసే ప్రయత్నం చేశారు. భారత ప్లేయర్లకు షేక్ హ్యాండ్ కు బదులు ఇలా చేద్దాం అంటూ అనేక రకాల సైగలు చేశారు ప్లేయర్లు. ఇందులో మహిళా క్రికెటర్లు కూడా ఉండటం గమనార్హం. వన్డే, టీ20 సిరీస్ త్వర లోనే జరుగనున్న తరుణంలో టీమిండియాను వీడియోలో చూపించినట్లుగా ఆసీస్ అవమానించిందని అంటున్నారు.
టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) మధ్య ఈనెల 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం దానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే వన్డే జట్టును కూడా ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అక్టోబర్ 19వ తేదీ నుంచి మూడు వన్డేలు టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్నాయి. ఈ మూడు వన్డేలు పూర్తయిన తర్వాత టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5 టీ20 మ్యాచ్ లు కూడా జరుగుతాయి. దీంతో ఇవాళ ఉదయం పూట ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా కు పయనం అయింది టీం ఇండియా. ఈ టోర్నమెంటుకు మరో నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు టీమిండియా ప్లేయర్లు. వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నిన్న టెస్ట్ పూర్తయిన తర్వాత వెంటనే ఆస్ట్రేలియా ప్రయాణమయ్యారు. ఇక ఆస్ట్రేలియాకు ప్రయాణమవుతున్న టీమిండియా ప్లేయర్ల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.