BigTV English

TROLLS on Google: తప్పులు చెబుతున్న గూగుల్ మాత..!

TROLLS on Google: తప్పులు చెబుతున్న గూగుల్ మాత..!

Google Shows Incorrect Info While Searching For “KL Rahul Wife”: పురాణ కథల్లో పలువురు అరణ్యాల్లోకి వెళ్లి తపస్సులు చేసేవారు. అలా వారి తపస్సుకు మెచ్చిన దేవతలు ప్రత్యక్షమై…‘నరుడా ఏమి నీ కోరిక’అని అడిగేవారని కథల్లో చెప్పేవారు. కానీ ఇప్పుడు కలియుగంలో 21వ శతాబ్దానికి వచ్చేసరికి.. ఆ దేవతల పాత్రలోకి
గూగుల్ మాత.. వచ్చింది.


మనుషులు కంప్యూటర్ ముందు కూర్చుని.. తమ ప్రశ్నలు, డౌట్లు, ఇన్ ఫర్మేషన్ ఏది అడిగినా.. వెంటనే గూగుల్ మాత ప్రత్యక్షమై.. క్షణాల్లో కావల్సిన సమాచారాన్ని అందించేస్తూ ఉంటుంది. ఇప్పుడందరి తలలో నాలుకలా గూగుల్ మాత మారిపోయింది.

గూగుల్ మాత చెప్పిన సమాచారం వందకి రెండొందల శాతం కరెక్టు అనే భావనలోకి ప్రజలు వెళ్లిపోయారు. అయితే ఆ సమాధానాలను.. నీలాంటోడో, నాలాంటోడు అక్కడ కూర్చుని రాసినవే.. వాటినే టెక్నికల్ గూగుల్ మాత చెబుతోందని, ఆ ఎంటర్ చేసేవాడు పొరపాటున తప్పు రాస్తే అదే అక్కడ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుందని, అందుకే అంత గుడ్డిగా ఫాలో కావద్దని,  ఎవరెంత బుర్ర బద్దలు కొట్టుకుని చెప్పినా వినేవారే కరవయ్యారు.


కానీ అలాంటివారి మైండ్ బ్లాక్ అయ్యేలా గూగుల్ మాత సమాధానాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రికెటర్ల భార్యల పేర్లనే మార్చేయడంతో నెట్టింట రచ్చరచ్చగా మారింది.

Also Read: యువరాజ్ కి గాలం వేస్తున్న.. ఫ్రాంచైజీలు

గతంలోకి వెళ్తే..  మొన్న విరాట్ కోహ్లీ భార్య అనుష్కశర్మను ఆప్గానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భార్యగా చూపించి నవ్వులపాలైన గూగుల్.. నిన్న యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ భార్య ఎవరని సెర్చ్ చేస్తే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్‌ పేరును చూపించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

తాజాగా మళ్లీ అలాంటి తప్పుడు సమాచారాన్ని జనం ముందు ఉంచుతూ తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్య కోసం సెర్చ్ చేస్తే బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి పేరును సూచించింది.

ఎందుకిలాంటి తప్పుడు సమాచారాలు వస్తున్నాయి?  వీటినెవరూ కరెక్టు చేసేవాళ్లే లేరా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×