BigTV English

Pakistan: బలూచిస్తాన్ బార్డర్ వద్ద రక్తపాతం.. 23 మంది ప్రయాణికుల హత్య!..

Pakistan: బలూచిస్తాన్ బార్డర్ వద్ద రక్తపాతం.. 23 మంది ప్రయాణికుల హత్య!..

Pakistan: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ప్రత్యేక దేశం కోసం చేస్తున్న పోరాటం హింసాత్మకంగా మారుతోంది. తాజాగా బలూచిస్తాన్ (Balochistan) నుంచి పంజాబ్ రాష్ట్రానికి వెళ్లే కార్లను సరిహద్దు వద్ద ఆపి అందులో ఉన్న ప్రయాణీకులను వివక్షతో కాల్చి చంపారు. ఈ ఘటన సోమవారం ఆగస్టు 26న జరిగింది.


పాకిస్తాన్ మీడియా ప్రకారం.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం సాయుధ పోరాటం చేస్తున్న మిలిటెంట్లు.. బలూచిస్తాన్ లోని ముసాఖెయిల్ జిల్లా నుంచి పంజాబ్ వెళుతున్న హైవే రోడ్డుపై బస్సులు, కార్లు, లారీలను ముట్టడించారు. ఆ తరువాత గన్ పాయింట్ పై అందులో ఉన్న ప్రయాణీకులందరినీ వారు రాష్ట్రానికి చెందిన వారని ప్రశ్నించారు. వారిలో ఎవరైతే బలూచిస్తాన్ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారో వారిని బలవంతంగా వేరు చేసి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో 23 మంది చనిపోగా అయిదు మందికి గాయాలయ్యాయి.

ముసఖెయిల్‌కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్.. నజీబ్ కాకర్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ”తుపాకులు కలిగిన కొందరు దుండగులు ముసాఖెయిల్ హైవేపై ప్రయాణిస్తున్న 10 వాహనాలను ముట్టడించారు. వాహనాల ప్రయాణిస్తున్ వారిని గన్ పాయింట్ పై బెదిరించి బయటు రప్పించారు. ఆ తరువాత వారిని విడదీసి 23 మందిని కాల్చి చంపారు. ఈ వాహనాలన్నీ పంజాబ్ రాష్ట్రానికి వెళుతున్నాయి. అందుకే ఈ వాహనాల్లో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారున్నారు. గాయపడిన వారిని, శవాలను సమీప ఆస్పత్రులకు తరలించడం జరిగింది.” అని చెప్పారు.


ఈ కాల్పులు జరిపింది బిఎల్‌ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ)కి చెందిన టెర్రరిస్టులని పోలీసలు తెలిపారు. ఈ టెర్రరిస్టులు ఇటీవల ఎక్కువగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.

బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ ఫరాజ్ బుగ్ టీ ఈ హింసాత్మక ఘటనను ఖండించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బలూచిస్తాన్ ప్రభుత్వం ఈ టెర్రరిస్టులను పట్టుకుంటుందని.. వారు తప్పించుకోలేరని.. కఠినంగా శిక్షిస్తామని ఆగ్రహంగా మాట్లాడారు.

బిఎల్ఏ మిలిటెంట్లు.. బలూచిస్తాన్ ప్రజలకు.. పంజాబ్ హైవేపై ప్రయాణించవద్దరని ఇటీవలే హెచ్చరికలు జారీ చేశారు. బలూచిస్తాన్ లో ఏ ఇతర రాష్ట్ర ప్రజలు ఉండకూడదని.. వారి సంస్కృతిని పంజాబీలు నాశనం చేస్తోందని బిఎల్ఏ పోరాటం చేస్తోంది. అయితే తాజా ఘటనపై బిఎల్ఏ ఇంతవరకు స్పందించలేదు.

Also Read: ‘ఎవరైనా చనిపోతే స్కూలుకు సెలవు ఇస్తారని’.. అయిదేళ్ల పసివాడిని హత్య చేసిన విద్యార్థులు

Related News

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Big Stories

×