BigTV English

IPL 2024 GT Vs LSG Preview: నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్.. మ్యాచ్ ప్రివ్యూ!

IPL 2024 GT Vs LSG Preview: నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్.. మ్యాచ్ ప్రివ్యూ!
LSG Vs GT
LSG Vs GT

IPL 2024 GT Vs LSG Match Preview & Prediction: ఐపీఎల్ మ్యాచ్ లు అంటే అదరహో అంటారు. ప్రస్తుతం 2024 సీజన్ లో కూడా అలాగే సాగుతున్నాయి. రోజురోజుకి మ్యాచ్ ల్లో హీట్ పెరిగిపోతోంది. నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు లక్నోలో జరగనుంది.


ఐపీఎల్ లో ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య నాలుగు మ్యాచ్ లు జరిగాయి. నాలుగింటిలో కూడా గుజరాత్ గెలవడం విశేషం. మరి ఈసారైనా రాహుల్ సేన ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా? అనేది చూడాలి. అలాగే శుభ్ మన్ గిల్… ఆ రికార్డ్ ను కాపాడుకుంటాడా? అనేది కూడా చూడాలి.

ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ లో లక్నో మూడు మ్యాచ్ లు ఆడి రెండు గెలిచి, ఒకటి ఓడింది. టేబుల్ లో 4 వస్థానంలో ఉంది. అలాగే గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ లు ఆడి రెండు గెలిచి, రెండు ఓడింది. టేబుల్ లో 7వ స్థానంలో ఉంది.


ఇంక ఈ రెండు జట్లలో చూస్తే లక్నో జట్టులో అరవీర భయంకర బౌలర్ మాయాంక్ యాదవ్ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. గత రెండు మ్యాచ్ లు లక్నో గెలిచిందంటే దానికి ఒకటే కారణం.మయాంక్…. తను ఆ రెండు మ్యాచ్ ల్లో కలిపి 6 వికెట్లు తీసుకున్నాడు.

Also Read: మానవత్వం చాటుకుంటున్న ముంబై ఇండియన్స్

ఇప్పుడు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేసే తననెలా ఎదుర్కోవాలనే దానిపైనే గుజరాత్ టైటాన్స్ విజయం ఆధారపడి ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఇంకా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. తను క్లిక్ అయితే గుజరాత్ కి కష్టాలు తప్పవు. ఓపెనర్ డికాక్ మళ్లీ టచ్ లోకి వచ్చాడు. పూరన్ మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ ఫినిషింగ్ కి పనికొస్తున్నాయి. ఇంకా దేవదత్ పడిక్కల్ బాకీ ఉన్నాడు.  స్టోయినిస్, కృనాల్ పాండ్యా కూడా ఇంకా ఫామ్ అందుకోలేదు.

ఇక గుజరాత్ విషయానికి వస్తే కెప్టెన్ గిల్ ఇప్పుడే ఫామ్ లోకి వచ్చాడు. తను కనెక్ట్ అయితే ఇంక ఆపడం ఎవరితరం కాదు. అలాగే వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్ బాగానే ఆడుతున్నప్పటికీ భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. క్రీజులో కుదురుకున్నాక అవుట్ అయిపోతున్నారు. డేవిడ్ మిల్లర్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నారు. కేన్ విలియమ్సన్ ఆడాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేస్తున్నాడు.

వీరి ప్రధాన బౌలర్ మోహిత్  శర్మ. ఇతనికి తోడుగా ఒమర్ జాయ్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ ఉన్నారు. వీరందరూ తలా ఒక చేయి వేస్తే లక్నోని నిలువరించే అవకాశాలున్నాయి.

Also Read: LSG vs GT highlights: ఐదు వికెట్లతో చెలరేగిన యశ్ ఠాకూర్.. గుజరాత్ చిత్తు..

గుజరాత్ టైటాన్స్ టీమ్(అంచనా)
వృద్ధిమాన్ సాహా, శుబ్ మన్ గిల్(కెప్టెన్), కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, ఒమర్ జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్(అంచనా)
డికాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్), దేవ్ దత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, సిద్దార్థ్

Related News

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Big Stories

×