BigTV English

IPL : మోహిత్ , గిల్ అదుర్స్.. పంజాబ్ పై గుజరాత్ గెలుపు..

IPL : మోహిత్ , గిల్ అదుర్స్.. పంజాబ్ పై గుజరాత్ గెలుపు..

IPL: ఐపీఎల్ -2023లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. గత మ్యాచ్ లో కోల్ కతా చేతిలో అనూహ్యంగా ఓడిన ఈ జట్టు తిరిగి పుంజుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మథ్యూ షార్ట్ (36), జితేశ్ శర్మ (25), శామ్ కరన్ (22), షారుఖ్ ఖాన్ (22) కాస్త రాణించారు. పంజాబ్ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా భారీ స్కోర్ సాధించకపోవడంతో ప్రత్యర్థి ముందు తక్కువ టార్గెట్ నే పెట్టింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మకు 2 వికెట్లు దక్కాయి. షమీ, జోష్ లిటిల్, జోసెఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.


154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(30, 19 బంతుల్లో 5 ఫోర్లు ), గిల్ (67, 49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. సాహా అవుటైనా గిల్ అదే జోరు కొనసాగించాడు. సాయి సుదర్శన్ (19), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ( 8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.

చివరి ఓవర్ లో టైటాన్స్ విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి. రెండో బంతికి గిల్ అవుట్ కావడంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. చివరి రెండు బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన తరుణంలో రాహుల్ తెవాటియా బౌండరీ కొట్టి గుజరాత్ ను గెలుపు తీరాలకు చేర్చాడు.


పొదుపుగా బౌలింగ్ చేసిన రెండు వికెట్లు తీసిన మోహిత్ శర్మకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు 4 మ్యాచ్ ల్లో 3 విజయాలతో గుజరాత్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ 4 మ్యాచ్ ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 6వ స్థానంలో ఉంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×