Jatayu : రావణుడితో జరిగిన పోరాటంలో జటాయువు రెక్కలు విరిగిపోయి, కాళ్ళు కోల్పోయి ఎటూ కాకుండా ఉన్నప్పుడు రామ లక్ష్మణులు వచ్చి చూసారు. అప్పుడు జటాయువు రావణుడితో ఎలా యుద్ధం చేసింది వివరంగా చెప్పి సీతమ్మ తప్పకుండా దొరుకుతుందని రాముడికి ధైర్యం చెప్పి ప్రాణాలు వదిలేసాడు. అది చూసిన రాముడు ఎంతో ఏడ్చాడు, రాముడి వెంట ఉన్న లక్ష్మణుడు కూడా ఏడ్చాడు.
జటాయువు… రామాయణంలోని అరణ్యకాండలో చెప్పుకోగదిన పాత్ర. రావణుడు సీతను అపహరించినప్పుడు అడ్డుపడి వీరోచితంగా పోరాడుతుంది జటాయువు అనే గద్ద. ఆ సమయంలో రావణుడు దాని రెక్కలు విరిచి నేల కూలుస్తాడు. కొండలపైన పడిపోయిన ఆ జటాయువు సీతాపహరణం గురించి రాముడికి వివరించి ప్రాణాలొదులుతుంది. దశరథుని మిత్రుడైన జటాయువు ఒక గ్రద్ద. వృద్ధాప్యంతో శరీరం సహకరించక పోయినా సీతను అపహరించుకుపోతున్న రావణుని ఎదిరించి కొనప్రాణమున్నంత వరకు పోరాడిన వీరుడుసీతమ్మను వెదుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు అమ్మ జాడ తెలిపి రామకార్య సాఫల్యానికి తోడ్పడిన గొప్ప జీవి.
జటాయువు కూలిన ప్రాంతంలో ఉందని కేరళలోని కొల్లాం జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలోని చాడాయమంగళం అని విశ్వాసం. దాన్నిప్పుడు కేరళ ప్రభుత్వం జటాయు నేషనల్‌పార్కుగా అభివృద్ధి చేసింది. గద్ద ఆకృతిలో 200 అడుగుల ఎత్తూ… 150 అడుగుల వెడల్పుతో రూపొందించిన పక్షి శిల్పం ప్రపంచంలోనే పెద్దదిగా గుర్తింపు పొంది గిన్నిస్‌లోకి ఎక్కింది. రాజీవ్ అంచల్ అనే దర్శకుడు కేరళ ప్రభుత్వం అనుమతితో దాదాపు పదేళ్లపాటు శ్రమించి ఆ పార్కును అభివృద్ధి చేశాడు. 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు కనుచూపుమేర పచ్చనికొండలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ వారాంతపు సెలవుదినాలలో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. కేబుల్ కారును ఉపయోగించి కొండపైకి చేరుకునే టప్పుడు పర్యాటకులకు అన్నో అనుభూతుల్ని మిగుల్చుతుంది.