Pandya- Jurel: ఐదు టి-20 ల సిరీస్ లో భాగంగా తొలి రెండు టి-20 ల్లో విజయం సాధించిన భారత జట్టు.. మూడో టి-20లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తో మంగళవారం రోజు రాజ్కోట్ వేదికగా జరిగిన మూడవ టి-20లో భారత జట్టు 26 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 172 పరుగుల లక్ష్య చేదనలో ఆతిధ్య జట్టు 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసింది. భారత బ్యాటింగ్ చూస్తే.. హార్దిక్ పాండ్యా 40, తిలక్ వర్మ 18, అభిషేక్ శర్మ 24, అక్షర్ పటేల్ 15, సూర్య కుమార్ యాదవ్ 14, సంజు శాంసన్ 3, వాషింగ్టన్ సుందర్ 6, దృవ్ జురెల్ 2 పరుగులు చేశారు.
హార్థిక్ పాండ్యా ఒక్కడే కాస్త పరవాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3, జోఫ్రా ఆర్చర్ 2, బ్రైడెన్ కార్స్ 2, మార్క్ ఉడ్ 1, ఆదిల్ రషీద్ 1 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు సిరీస్ లో టీమిండియా ఆదిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇక ఇరుజట్ల మధ్య నాలుగో టీ-20 మ్యాచ్ జనవరి 31న పూణేలో జరగబోతోంది. అయితే మూడో టి-20 లో హార్దిక్ పాండ్యా ఆటతీరుపై క్రీడాభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 35 బంతులలో 40 పరుగులు చేశాడు. ఇందులో అతని స్ట్రైక్ రేట్ 114.29 మాత్రమే. ఈ 40 పరుగులలో ఒక ఫోర్, రెండు సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. అయితే కీలకమైన మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా ఎక్కువ డాట్ బాల్స్ ఆడడం వల్ల మ్యాచ్ లో రన్ రేట్ గణనీయంగా పెరిగింది. ఓ దశలో 27 బంతులలో కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. ఇది మాత్రమే కాకుండా అతడి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే భారత జట్టు ఓటమికి కారణం అనే విమర్శలు కూడా వస్తున్నాయి.
18 ఓవర్ చివరి బంతికి యువ ఆటగాడు దృవ్ జురెల్.. రన్ తీయడానికి ప్రయత్నించాడు. కానీ నాన్ స్ట్రైక్ అండ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా సింగిల్ తీసేందుకు నిరాకరించాడు. హార్దిక్ పాండ్యా సింగిల్ తీసి ఉంటే.. జురెల్ తిరిగి నెక్స్ట్ ఓవర్ లో స్ట్రైక్ లో ఉండేవాడు. కానీ జురెల్ ని ఓ టేలెండర్ బ్యాటర్ లా చూసిన హార్దిక్ పాండ్యా.. సింగిల్ కి నిరాకరించి నెక్స్ట్ ఓవర్ కి స్ట్రైక్ తీసుకున్నాడు. జురెల్ కూడా ఓ మంచి బ్యాటర్. ఆ విషయాన్ని మరిచిన హార్దిక్ పాండ్యా ఓవర్ యాక్షన్ తో నెక్స్ట్ ఓవర్ కి స్ట్రైక్ లోకి వచ్చి మొదటి బాల్ కే అవుట్ అయ్యాడు.
Also Read: ప్రియురాలి కోసం అక్రమంగా పాకిస్తాన్ వెళ్లిన భారతీయుడు.. మోసం చేసిన యువతి..కానీ..
లాంగ్ ఆఫ్ ప్రాంతంలో భారీ సిక్సర్ కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు హార్దిక్ పాండ్యా. దీంతో కోపంగా ఊగిపోతూ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. దీంతో హార్దిక్ పాండ్యా రన్ కి నిరాకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు హార్దిక్ పాండ్యా పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ సింగిల్ తీసి ఉంటే బాగుండేదని, అతడి బలుపే టీమిండియా కొంప ముంచిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) January 28, 2025